చిన్నంబావిలో కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తా
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:10 PM
కొల్లాపూర్ తాలూకా చిన్నంబావి మం డలంలో కొత్తగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి, నాగర్‌కర్నూల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ న్యా యమూర్తి తిరుమలాదేవి పేర్కొన్నారు.
- హైకోర్టు న్యాయమూర్తి నాగర్‌కర్నూల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి తిరుమలాదేవి
కందనూలు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కొల్లాపూర్ తాలూకా చిన్నంబావి మం డలంలో కొత్తగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి, నాగర్‌కర్నూల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ న్యా యమూర్తి తిరుమలాదేవి పేర్కొన్నారు. జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వ హణలో భాగంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టులో నిర్వహించిన సమావే శానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ జిల్లా కోర్టులకు నేను పరిపాలన న్యాయమూర్తిగా నియామకమైన తర్వాత నిర్వహిస్తున్న కార్య క్రమానికి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమ ని పేర్కొన్నారు. కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడం అభినందనీయమన్నారు. అంతకంటే ముందుగా జిల్లా ప్రధాన న్యాయాధికారి రమాకాంత్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్‌తోపా టు కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరి తగతిన పరిష్కరించేందుకు న్యాయవాదులు చాలా బాగా సహకరించారన్నారు. అయితే నాగర్‌కర్నూల్ పట్టణంలో ఉన్న కోర్టు బిల్డింగ్ కొత్తగా అదనపు అంత స్తు నిర్మాణం జరుగుతుండడం ఆగస్టు మాసంలోపు న్యాయవాదులు ఒకే ఫ్లోర్ కింద పని చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇక కల్వకుర్తి, అచ్చంపేట భవ నాల్లో అదనపు కోర్టు భవనం నిర్మాణం చేపట్టాలని అందుకు అడ్మినిస్ట్రేటివ్ న్యా యాధికారి సహకారం కావాలని కోరారు. తర్వాత జిల్లాలో ఒక్కటే సబ్ కోర్టు ఉండడం కొంత కేసుల పరిష్కారానికి అంతరాయం ఏర్పడుతుందని, మరొక సబ్ కోర్టు మంజూరు చేస్తే కేసుల సత్వర పరిష్కారానికి వీలవుతుందన్నారు. పోక్సో స్పెషల్ న్యాయాధికారి నజీమా సుల్తానాతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రెసిడెంట్లు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.