ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:10 PM
ఉపాధ్యాయ సమస్యల పరి ష్కారం పీఆర్టీయూ తెలంగాణతోనే సాధ్యమని వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అన్నారు.
- వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయ సమస్యల పరి ష్కారం పీఆర్టీయూ తెలంగాణతోనే సాధ్యమని వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అన్నారు. గురువారం పీఆర్టీయూ తెలంగాణ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపా ధ్యాయ సమస్యలను ప్రభుత్వాన్ని ఒప్పించి పరిష్కరించామన్నారు శిశు సంరక్షణ సెలవులు తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు. ఉపాధ్యా యులకు టెట్ అర్హత లేకుండా పదోన్నతలు సాధించామని, పెండింగ్‌లో ఉన్న బదిలీలు, జీవో 317 అమలులో కీలకంగా వ్యవహరించి ఉపాధ్యాయులకు న్యాయం చేశామన్నారు. కార్య క్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, సోమ నాథ్, యుగేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, భూపతిసింగ్, రామచంద్ర రాథోడ్, శ్రీనివాసులు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.