చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:32 PM
గద్వాల చేనేత జరీ చీరలు ఎంతో ప్ర ఖ్యాతి చెందాయని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
ఆరగిద్ద గ్రామంలో చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లిన కలెక్టర్
నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని కార్మికులకు సూచన
గట్టు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : గద్వాల చేనేత జరీ చీరలు ఎంతో ప్ర ఖ్యాతి చెందాయని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మంగళవా రం గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రామలోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ కార్మికులతో కష్టనష్టాలను తెలుసుకున్నారు. మగ్గాలను పరిశీలించారు. చీర తయారు చేయడాన్ని తెలుసుకున్నారు. నేసిన చీరను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆరగిద్ద చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నేసిన చేనేత చీరలను నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. సంస్థ కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.98 లక్షల రుణాలు ఇవ్వాలని గతంలోనే డీసీసీబీలో అడుగగా రాలేదని సంఘం అధ్య క్షుడు నర్సప్ప కలెక్టర్‌కు దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఎల్డీఎం శ్రీనివాసరావుతో మాట్లాడి బ్యాంకు రుణాలు మంజూరు చేస్తానని తెలిపా రు. అనంతరం కలెక్టర్‌ను చేనేత కార్మికులు సన్మానించారు.