విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు కృషి
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:56 PM
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా అన్నారు.
కమ్యూనిటీ కిచెన్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
మల్దకల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా అన్నారు. గురువారం మండలంలోని కుర్తిరావులచెర్వు గ్రా మంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్‌ట్ర స్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ కిచెన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. వంటశాల ని ర్మాణం, వంట యంత్రాల ఏర్పాటు, ఆహార పదార్థాల నిల్వకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సౌకర్యాలు, భ ద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అ డిగి తెలుసుకున్నారు. పూర్తికావాల్సిన పనులపై జాప్యంలేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల ఆరోగ్యం, అ భ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంలో తె లంగాణ స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కమ్యూనిటీ కిచెన్ ద్వారా ఆహారతయారీ నిర్వహణ, స క్రమంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నా రు. వంట చేసే ప్రదేశాలు, పాత్రలు, ఆహార పదార్థాల నిల్వ ప్రాంతాలు, పరిసరాలను నిరం తరం పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. సురక్షితమైన తాగునీరు, పారిశుధ్యం, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కిచెన్‌కు రాకపోకలు సులభంగా ఉండేలా మౌలిక సదుపాయాలు వంటశాలకు అనుసంధానంగా సీసీరోడ్డు నిర్మాణం చేపట్టేలా అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆస్ప త్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆస్ప త్రిలో ప్రసవాల సంఖ్య పెంచేలా దృష్టి సారిం చాలని, హైరిస్క్ గర్భిణులను ముందుగానే గు ర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ స్వరూపరాణి, వైద్యసిబ్బంది, అదనపు కలెక్టర్ నర్సింగరావు, హెచ్‌కే ఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఝాన్సీరాణి, అధికారులు ఉన్నారు.