Share News

గద్వాలలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:43 PM

జోగుళాంబ గద్వాల జిల్లా లో ఉన్న పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా మరింత అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ రి జ్వాన్‌బాషాషేక్‌ తెలిపారు

గద్వాలలో   పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి

- కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌

గద్వాల న్యూటౌన్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా లో ఉన్న పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా మరింత అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ రి జ్వాన్‌బాషాషేక్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. అలంపూర్‌ ఆలయా ల వద్ద ప్రసాద్‌స్కీం, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశారన్నారు. భక్తులకు ఉపయోగపడేలా నిర్మాణాలు, ఆలయాల వద్ద పచ్చదనం పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేయాలన్నారు. అలంపూర్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద యాత్రికుల వసతి సౌకర్యార్థం అవసరమైన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలన్నారు. బీచుపల్లి ఆలయం వద్ద కృష్ణానది మధ్యలో ఉన్న నిజాం కొండ ఐలాండ్‌ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలన్నారు. గద్వాల కోట బురుజుల అభివృద్ధితో పాటు కోట సందర్శనార్థం వచ్చే పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఇప్పటికే రూ.15 కోట్లతో థీమ్‌పార్క్‌ను నిర్మిస్తున్నందున అవసరమై ఇతర పర్యాటక నిర్మాణాలను చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి కృష్ణయ్య, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:43 PM