Share News

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:36 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌, నిజాంకొండ, గద్వాల కోట తదిత ర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నారు.

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి కృషి
వీసీ సమీక్షలో పాల్గొన్న అదనపు కలెక్టర్లు, అధికారులు

  • జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌

గద్వాల, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌, నిజాంకొండ, గద్వాల కోట తదిత ర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్వి సంజయ్‌ జాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి వర్షాభావ పరి స్థితులు, నీట్‌-పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అ భివృద్ధి తదితర అంశాలపై హైదరాబాద్‌ నుంచి అన్నిజిల్లాల కలెక్టర్లతో, సంబంధిత జిల్లాల అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష ని ర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేయాలని, ప్రతీ జిల్లాలో ప ర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూ చించారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, పార్కింగ్‌, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, శుభ్రత, సూచికబోర్డులు, ఇతర సౌకర్యాలను మె రుగుపరచాలని సీఎస్‌ ఆదేశించారు. స్థానిక ఐ డీవోసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిఇల్లా అధికారులతో కలిసి వీసీలోపాల్గొన్న అనంతరం అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ జిల్లా అధికా రులకు తగు సూచనలు చేశారు. లోటు వర్షపా తాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల సాగుకు ప్ర ణాళిక సిద్ధం చేయాలన్నారు. సెప్టెంబరు చివ రి వరకు పెద్దగా వర్షాలు కురుసే అవకాశం లే దని వాతావరణ నిపుణులు సూచించిన నేప థ్యంలో పంటలు, సాగు నీరు, తాగునీటి లభ్య తను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, జిల్లా పర్యాటక శాఖ అధికారి రామలింగేశ్వర్‌ గౌడ్‌, జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 11:36 PM