Share News

జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:55 PM

జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చే స్తున్నామని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివా స్‌రెడ్డి అన్నారు.

జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి
జిమ్‌, బాక్సింగ్‌ సెంటర్‌ కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చే స్తున్నామని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివా స్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని డీఎస్‌ఏ మైదానంలో జిమ్‌, బాక్సింగ్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లా డుతూ జిల్లా క్రీడా మైదానానికి ప్రతీ రోజు వచ్చే వందలాది క్రీడాకారులు, యువతకు ఉప యోగపడేలా ఆధునిక సదుపాయాలతో జిమ్‌, బాక్సింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సూచిం చారు. అధికారులతో మాట్లాడి, ప్రతిపాదిత ని ర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు అవసమైన సదుపాయాలు క ల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్‌ మమత, ము డా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ యం. సురేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డీవై ఎస్‌వో రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

సొంతింటి కల నెరవేర్చడం అదృష్టం

మహబూబ్‌నగర్‌: పేదలకు సొంతింటి కల నెరవేర్చడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నగరంలోని 27వ డివిజన్‌లో నిర్మించిన ఇంది రమ్మ ఇళ్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత పేదలకు సొంతింటి కలను సాకరం చేసేందుకు కట్టుబడి పనిచే స్తున్నామన్నారు. అనంతరం పీర్ల మసీదులో చాదర్‌ కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్‌ గుమాల్‌ మమత, కార్పొరేటర్లు ఫయాజ్‌, తాహేర్‌, మజ్జీద్‌, ప్రవీ ణ్‌కుమార్‌, గుండా మనోహర్‌, గౌస్‌బాయ్‌, ఆమేర్‌, హదీద్‌, జావీద్‌, ఫిర్‌దోస్‌, సిలెమాన్‌, మజార్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములవుదాం

హన్వాడ: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పని చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం మండ లంలోని వెంకటమ్మ కుంటతండా పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, లింగం, కృష్ణయ్య, మహేందర్‌, రఘురాంగౌడ్‌, చెన్నయ్య తది తరులు పాల్గొన్నారు.

మండలంలోని రాంనాయక్‌తండా సర్పంచు జ్యోతిని ఎన్నికల్లో ఆడబిడ్డ పుడితే రూ.5వేల ఆ ర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చింది. ఆ దివారం గ్రామంలో సమావేశం నిర్వహించి ఆడ పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు రూ.5వేలు ప్రభుత్వ విప్‌ చేతుల మీదుగా అందించారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: గ్రామాల అభివృ ద్ధే రాష్ట్ర అభివృద్ధి అని ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని లాల్యనాయక్‌తండా లో పంచాయతీ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, సర్పంచు ప్రతాప్‌ నాయక్‌, ఉపసర్పంచు లక్ష్మన్‌ నాయక్‌, రాజు నాయక్‌, ఛత్రపతి నాయక్‌, చందు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 11:55 PM