Share News

విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థుల విజయం

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:46 PM

నీట్‌ పేపర్‌ లీక్‌తో ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థుల విజయం
గద్వాలలో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

  • డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి

గద్వాల, జూలై 26(ఆంధ్రజ్యోతి): నీట్‌ పేపర్‌ లీక్‌తో ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో విద్యార్థుల పోరాటం ప్రతిపక్ష నేత సంఘీభావంతో విజయం సాధించిన సందర్భంగా ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ శంకర్‌, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి తుమ్మల నర్సింహులు, చంద్రశేఖర్‌, సత్యం, నరహరి శ్రీనివాసులు, సతీశ్‌ తదితరు లు పాల్గొన్నారు

Updated Date - Jul 26 , 2026 | 11:46 PM