Share News

విద్య, సాగునీటి రంగాలకు అత్యంత ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 17 , 2026 | 11:39 PM

విద్య, సాగునీటి రంగాలకు అ త్యంత ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు చిత్తశుద్ధి, పట్టుదలతో చదువి జ్ఞాన సంపదను పెంచుకోవాలని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన్‌పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రూ.200 కోట్లతో నిర్మించే ఐఐఐటీ కళాశాల భవనం ని ర్మాణానికి సీఎం శనివారం శంకుస్థాపన చేశారు.

విద్య, సాగునీటి రంగాలకు అత్యంత ప్రాధాన్యం
జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలో ఏర్పాటు చేసిన స్టాల్‌ వద్ద విద్యార్థినులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

విద్యార్థులు జ్ఞాన సంపదను పెంచుకోవాలి

17 ఏళ్లలో అన్ని చట్టసభల్లో పని చేశా

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రూ.200 కోట్లతో నిర్మించే ఐఐఐటీ కళాశాల భవనం నిర్మాణానికి శంకుస్థాపన

జడ్చర్ల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): విద్య, సాగునీటి రంగాలకు అ త్యంత ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు చిత్తశుద్ధి, పట్టుదలతో చదువి జ్ఞాన సంపదను పెంచుకోవాలని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన్‌పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రూ.200 కోట్లతో నిర్మించే ఐఐఐటీ కళాశాల భవనం ని ర్మాణానికి సీఎం శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల లు, గురుకుల పాఠశాలలు, ఐఐఐటీ కళాశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన ము ఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణరావు అని, 75 సంవత్సరాల అనంత రం మళ్లీ పాలమూరుకు అవకాశం తన ద్వారా వచ్చిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భాష అనేది వెపన్‌లాంటిదన్నారు. ఎవరితోనైనా సులువు గా మాట్లాడవచ్చని, ఏదైనా సృష్టించవచ్చన్నారు. భాషతో పా టు జ్ఞానంను పెంచుకోవాలన్నారు. కష్టపడి చదువుకుని రాణించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే తాను విద్యాభ్యా సం చేసానని చెప్పారు. 2006లో జడ్పీటీసీగా, 2007లో ఎమ్మెల్సీగా, 2009లో ఎమ్మెల్యేగా, 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎం పీగా, 2023లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా... 17 సంవత్సరాలలో దే శంలోని అన్ని చట్ట సభల్లో పని చేసిన అనుభవం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు పూర్తయ్యిందని, ప్రజల కు మేలు చేయాలనే ఆలోచనతోనే ముందుకు సాగుతున్నామ ని అన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే విజ్ఞత, విజ్ఞానం ఉండాలని విద్యార్థులకు సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన సందర్భంలో జామీనుదారులు, జాగీర్దారులు, భూస్వాముల వ ద్ద ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావులు సీలింగ్‌ చట్టం తెచ్చి ప్రభుత్వం తీసుకుందన్నా రు. ఆ భూములను దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీనవర్గాలు, నిరుపేదలకు అసైన్డ్‌ భూమిగా, పోడు భూములు పట్టాలు ఇచ్చి పంపిణీ చేశారన్నారు. ఇళ్లు లేని వాళ్లకు ఇందిర మ్మ ఇళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని, ఉన్న భూములు పేదలకు పంపకాలు జరిగిపోయాయని అన్నారు. ఆర్థిక లబ్ధి పొందాలంటే కేవలం విద్య ఒక్కటే ఉందన్నారు. ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకునే పరిస్థితితో పాటు స మాజంతో పోటీ పడాలన్నా, అభివృద్ధి చెందిన పౌరుడిగా ఎదిగేందుకు విద్య మాత్రమే తోడ్పడుతుందన్నారు. రాష్ట్రంలో విద్య కు అత్యంత ప్రాధానత్య ఇస్తున్నామన్నారు. పాలమూరు జిల్లా కు ఇంజనీరింగ్‌ కళాశాల, లా కళాశాలను ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాల నెలకొల్పుతున్నామన్నారు.

జిల్లా వాసి సంతకం పెడితే ఏదైనా జరుగుతుంది

ఏయే కళాశాలలు కావాలో తెచ్చుకున్నామని, పాలమూ రు జిల్లా వాసి సంతకం పెడ్తే ఏదైనా జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవ్వదగిన స్థానంలో ఉన్నామన్నారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితారాణి, కలెక్టర్‌ విజయేందిర బో యి, ఎస్పీ జానకిలకు గ్రామంలో ఉన్న భూమలు కాదని, వారి నేపథ్యం వాళ్ల చదువు అని అన్నారు. బాగా చదువుకు న్న దామోదర రాజనరసింహ ఒక మంత్రిగా ఏ శాఖ అ యినా సమర్థవంతంగా నిర్వహిస్తాడని కొనియాడారు. 25 సంవత్సరాలు కష్టపడి చదువుకోవాలని, మిగిలిన 75 సంవత్సరాలు సుఖమైన జీవితం గడపవచ్చన్నారు. గ్రూప్‌-1, సివి ల్‌ సర్వెంట్‌లో ఎంపికైతే ప్రతీ ఒక్కరు ఇంటికి వచ్చి గౌరవం ఇస్తారన్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా తెలంగాణకు చెందిన, పాలమూరు జిల్లాకు చెందిన ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు ఉండాలని ఆకాంక్షించారు. ఏ స్థాయికి ఎదిగినా కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును మరవవద్దని హితవు పలికారు. సంవత్సరంలోపు కళాశాల భవనం పూర్తి అవుతుందని చెప్పారు.

విద్య, వైద్యానికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల నియోజకవర్గంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. జైలుకు కేటాయించిన స్థలంలో జైలు వద్దని, ఐఐఐటీ కళాశాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరామ న్నారు. అందుకనుగుణంగా కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో 2021లో కేవలం 50 శాతం ఫలితాలు మాత్రమే వచ్చాయని, నేడు 95 శాతానికిపైగా ఫలితాలు వచ్చాయన్నారు. జిల్లాకు మంజూరు అయిన ఐఐఐటీ కళాశాలలో పాలమూరు జిల్లా కు చెందిన 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, అందులో జడ్చర్ల నియోజకవర్గంకు చెంది న ఐదుగురు విద్యార్థులుండడం గర్వకారణమ ని పేర్కొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 11:39 PM