Share News

విద్య మాత్రమే వ్యక్తికి స్థిరమైన సంపద

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:35 PM

సమాజ పురోగతి విద్యతోనే సాధ్యమని, విద్యను మించిన స్థిరమైన ఆస్తి వ్యక్తికి మరొకటి ఉండ దని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నా రు.

విద్య మాత్రమే వ్యక్తికి స్థిరమైన సంపద
విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తున్న మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

  • మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

గద్వాల టౌన్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సమాజ పురోగతి విద్యతోనే సాధ్యమని, విద్యను మించిన స్థిరమైన ఆస్తి వ్యక్తికి మరొకటి ఉండ దని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నా రు. 2025-26 విద్యా సంవత్సరం పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులకు మంగళవారం పట్టణంలో ని డీకే బంగ్లాలో ఆమె చేతులమీదుగా శ్రీరామ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జిల్లా టాపర్‌గా నిలిచిన ఉత్తనూ రు జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని పవిత్రకు రూ.లక్ష చెక్కును అందించి సన్మానించారు. అంతేకాకుం డా జిల్లాలోని అన్ని మండలాల్లో మండల స్థా యి టాపర్లుగా ప్రతిభ చాటిన విద్యార్థులకు రూ.10వేల చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రోత్సాహక బహుమతులు విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని మరింత పెంచు తాయన్నారు. అనంతరం ఇటీవల ఎన్నికైన జో గుళాంబ గద్వాలజిల్లా రెడ్డి సేవా సమితి నూత న పదాధికారులు డీకే అరుణను కలిశారు. నూతన కమిటీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామాంజనే యులు, బండల వెంకటరాములు, రవికుమార్‌ ఎక్బోటే, వెంకటేశ్వర్‌రెడ్డి, బాబుల్‌ రెడ్డి, శ్రీరామ్‌ గ్రూప్‌ ప్రతినిధులు, విద్యార్థులు తల్లిదండ్రులు, సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేందర్‌ రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారి అశోక్‌రెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు మారుతి శ్రీనివాస్‌రెడ్డి, సాం స్కృతిక కార్యదర్శి నరిసంహారెడ్డి, మీడియా ఇన్‌చార్జి జగదీశ్వర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు దినేశ్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, కార్యవర్గసభ్యులు ఉన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:35 PM