స్వగ్రామంలో దసరా
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:39 PM
ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి విజయదశమి వేడుకలను ఆయన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరుపుకొ న్నారు.
-కుటుంబ సభ్యులతో కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- డప్పు చప్పుళ్లు, గజమాలతో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు
- చిన్ననాటి మిత్రులు, గ్రామస్థులతో సరదాగా గడిపిన ముఖ్యమంత్రి
వంగూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి విజయదశమి వేడుకలను ఆయన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరుపుకొ న్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండా రెడ్డిపల్లి కి మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు. సీఎంకు ఎంపీ మల్లురవి, ఉమ్మడి పామూరు జిల్లాలోని ఎ మ్మెల్యేలు వంశీకృష్ణ, నారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయ క్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కేవీఎన్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ అదర్శ్‌సురభి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీపాటి ల్, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోనిచాబ్రా, ఆదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం తదితరులు స్వా గతం పలికారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఓ పెన్‌టాప్ జీపులో వెళ్తూ గ్రామస్థులకు అభివాదం చే శారు. గ్రామస్థులు డప్పుచప్పుల్లు, గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఆంజనేయస్వామి, కోట మైశమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
శమీ వృక్షానికి పూజలు
విజయదశమి వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి గ్రామస్థులతో కలిసి శమీవృక్షానికి పూ జలు చేశారు. అనంతరం గ్రామస్థులకు, రాష్ట్ర ప్రజ లకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా వేడుకల సందర్భంగా సీఎం చిన్ననాటి మిత్రులు, గ్రామపెద్దలు, స్థానిక ప్రజలతో ముచ్చటించారు. అం తకు ముందు గ్రామంలో సీఎం ర్యాలీలో డిండి ఎత్తి పోతల ప్రాజెక్టును రద్దు చేయాలని, ముంపునకు గురవుతున్న ఎర్రవెల్లి గ్రామాన్ని కాపాడాలని కోరు తూ ఫ్లెక్సీతో పొల్కంపల్లికి చెందిన అర్జున్‌రెడ్డి నిరస కు యత్నించాడు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఫ్లెక్సీని లాగేసుకొని అతన్ని అక్కడి నుంచి పంపించా రు. కార్యక్రమంలో విద్యాకమిషన్ సభ్యుడు చార కొండ వెంకటేశ్, సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్య, ఉపసర్పంచ్ వేమారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, లాలు యాదవ్, రాములు యాదవ్, జంగయ్య యాదవ్ ఉన్నారు.