Share News

లోకుర్తిలో దళితుల ఇళ్ల విచారణ చేపట్టిన డీఎస్పీ

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:06 PM

మం డల పరిధిలోని లోకుర్తి గ్రామంలో ఆదివారం నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య ఎస్‌ఐ నరేష్‌తో కలిసి విచారణ చేపట్టారు.

లోకుర్తిలో దళితుల ఇళ్ల విచారణ చేపట్టిన డీఎస్పీ
లోకుర్తిలో దళితులతో మాట్లాడుతున్న డీఎస్పీ లింగయ్య

దామరగిద్ద, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మం డల పరిధిలోని లోకుర్తి గ్రామంలో ఆదివారం నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య ఎస్‌ఐ నరేష్‌తో కలిసి విచారణ చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు కూల్చేసిన దళితుల ఇళ్లను పరి శీలించారు. బాఽధితులతో మాట్లాడి ఘటనా వివ రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా దళి తులు మాట్లాడుతూ మా తాతల కాలం నుంచి నివాసం ఉంటున్న మా ఇళ్లను భూస్వాములు కూల్చుతున్నారని వాపోయారు. మేము నివా సం ఉంటున్న ఇళ్లకు పట్టాలు ఇప్పించి, న్యా యం చేయాలని డీఎస్పీ దృష్టికి తెచ్చారు. సీపీ ఎం మండల కార్యదర్శి అంజిలయ్యగౌడ్‌, దళిత బహుజన శ్రామిక యూనియన్‌ జిల్లా ఇన్‌చార్జి చిన్నయ్య, బాబు, సంజీవ్‌, నర్సింహ, బాలకి ష్టప్పతో పాటు గ్రామ దళితులు ఉన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 11:06 PM