Share News

కమ్ముకున్న కరువు మేఘాలు

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:49 PM

ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి.

కమ్ముకున్న కరువు మేఘాలు
నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఎండిన వరి పంట

- జాబితాలో ఉమ్మడి జిల్లాలోని 63 మండలాలు

- నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పరిస్థితి తీవ్రం

- నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పరిస్థితి తీవ్రం

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూల్‌/ గద్వాల/ నారాయణపేట/ వనపర్తి/ అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. తీవ్ర వర్షాభావంతో అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. సాగు చేసిన పంటలోనూ 30 శాతం మేర ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి అధికారులు కరువు మండలాల జాబితాను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం పరిశీలించి మంగళవారం తుది జాబితాను విడుదల చేసింది. అందులో నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని అన్ని మండలాలూ ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 13, గద్వాలలో 13, నారాయణపేటలో 13, నాగర్‌కర్నూల్‌లో 13, వనపర్తి జిల్లాలో 11 మండలాలు ఈ జాబితాలో ఉన్నాయి.

అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం

జూన్‌ నుంచి ఇప్పటి వరకు మహబూబ్‌నగర్‌లో 37, వనపర్తిలో 38, నాగర్‌కర్నూల్‌లో 40, నారాయణపేటలో 43, గద్వాలలో 50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో వర్షాధార పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 9.54 లక్షల ఎకరాలలో సాగు కావాల్సిన వరి 6.56 లక్షలకు పడిపోయింది. పత్తి 8.13 లక్షల ఎకరాలకు గాను, 4.54 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. అన్ని పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు, సాగు చేసిన పంటలు కూడా వర్షాలు లేక ఎదుగుదల తగ్గిపోయి దిగుబడి పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందించారు. కృష్ణానదికి వరదలు లేకపోవడంతో జూరాల ప్రాజెక్టు, దాని పరిధిలోని రిజర్వాయర్లు కూడా నిండలేదు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి ఎంజీఎల్‌ఐ ద్వారా నీటిని ఎత్తిపోసినా తాగునీటి అవసరాలకు నిల్వ చేశారు. తుంగభద్ర నుంచి ఆర్డీఎస్‌కు చుక్కనీరు రాకపోవడంతో వరికి క్రాప్‌ హాలిడే ప్రకటించారు. ఆరుతడి పంటలు సాగు చేసినా, నీరు లేక ఎండిపోయాయి.

జిల్లాల వారీగా ఇలా...

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. వాటిలో 13 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అందులో మహబూబ్‌నగర్‌ రూరల్‌, మహబూబ్‌నగర్‌ అర్బన్‌, హన్వాడ, జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, దేవరకద్ర, సీసీకుంట, మూసాపేట, అడ్డా కుల, గండీడ్‌, కోయిలకొండ, కౌకుంట్ల, మండలాలున్నాయి. మిడ్జిల్‌, మహ్మదాబాద్‌, భూ త్పూర్‌, నవాబ్‌పేట మండలాలను కరువు జాబితా నుంచి మినహాయించారు.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 20 మండలా లుండగా, 13 మండలాలను కరువు జాబితా లో చేర్చారు. వాటిలో చారకొండ, వంగూరు, ఊర్కొండ, వెల్దండ, అమ్రాబాదు, పదర, బ ల్మూరు, లింగాల, పెద్దకొత్తపల్లి, కోడేరు, కల్వకుర్తి, బిజినేపల్లి, అచ్చంపేట ఉన్నా యి.

- జోగుళాంబ గద్వాల జిల్లాలోని 13 మం డలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. జిల్లాలోని గద్వాల, ధరూర్‌, గ ట్టు, కేటీదొడ్డి, మల్దకల్‌, అయిజ, వడ్డేపల్లి, రా జోలి, ఉండవెల్లి, ఆలంపూర్‌, మానవపాడు, ఇ టిక్యాల, ఎర్రవల్లిలను కరువు మండలాలుగా ప్రకటించారు.

- నారాయణపేట జిల్లాలోని 13 మండలా లను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రక టించింది. జిల్లాలోని దామరగిద్ద, నారాయణపే ట, మాగనూర్‌, కృష్ణ, మక్తల్‌, నర్వ, మరికల్‌, ధన్వాడ, గుండుమాల్‌, కోస్గి, మద్దూర్‌, ఊ ట్కూర్‌, కొత్తపల్లిలను కరువు మండలాలుగా గుర్తించారు.

- వనపర్తి జిల్లాలో అమరచింత, పాన్‌గ ల్‌, కొత్తకోట, ఆత్మకూర్‌, వీపనగండ్ల, పెద్దమందడి, ఏదుల, ఘనపూర్‌, గోపాల్‌పేట, వనపర్తి, పెబ్బేరు, మొత్తం 11 కరువు మండలాలను గుర్తించారు.

Updated Date - Oct 27 , 2026 | 11:49 PM