Share News

తాగునీటి సమస్య తలెత్తొద్దు

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:26 PM

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చే యాలని కలెక్టర్‌ హేమంత కేశ వ్‌ పాటిల్‌ అధికారులను ఆదే శించారు.

తాగునీటి సమస్య తలెత్తొద్దు
కల్వకుర్తి పట్టణంలోని మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

-ముందస్తు ప్రణాళికతో ప్రజలకు నిరంతరాయంగా నీరందించాలి : కలెక్టర్‌

కల్వకుర్తి, జూలై 17 (ఆంధ్ర జ్యోతి) : తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చే యాలని కలెక్టర్‌ హేమంత కేశ వ్‌ పాటిల్‌ అధికారులను ఆదే శించారు. శుక్రవారం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను తనిఖీ చేశారు. కల్వకుర్తి, అ చ్చంపేట, జడ్చర్ల, రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తా గు నీటిని అందిస్తున్న ఈ కేంద్రం లో నీటి శుద్ధి, పంపిణీ, నీటి నాణ్యత పరీక్షల విధానా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రజలకు అందే ప్రతీ నీటిబొట్టు నాణ్యమైనదిగా, సురక్షితమైనదిగా ఉండాలని సూచించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరందించడమే ప్రతీ అధికారి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట మిషన్‌ భగీరథ ఈఈ సుధాకర్‌సింగ్‌, కల్వకుర్తి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల, ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఇబ్రహీం, డీఈఈ మహి పాల్‌, మునిసిపల్‌ కమిషనర్‌, వివిధశాఖల అధికారు లు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:26 PM