అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించొద్దు
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:47 PM
అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబి తాలో నుంచి తొలగించడానికి వీలు లేదని ఏఐసీసీ పరిశీలకులు రవీందర్‌దాస్ అన్నారు
- వచ్చేనెల ఒకటిన ఢిల్లీలో భారీ నిరసన
- ఏఐసీసీ పరిశీలకుడు రవీందర్‌దాస్
మహబూబ్‌నగర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబి తాలో నుంచి తొలగించడానికి వీలు లేదని ఏఐసీసీ పరిశీలకులు రవీందర్‌దాస్ అన్నారు. మ హబూబ్‌నగర్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్ర భుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌లతో కలిసి మాట్లాడారు. కేం ద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టు కుని కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు సర్ పేరిట కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో పలు విడతల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అందు లో భాగంగా వచ్చేనెల ఒకటవ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్‌స్థాయి ఏజెంట్లు, ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడి వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఇలా దేశవ్యాప్తంగా సేకరించిన స మాచారాన్ని విశ్లేషించి, ఓటర్ల జాబితాలోని లోపాలు, అవకతవకలను ప్రజలముందు ఉంచుతామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రం థాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిప్యూటీ మేయర్ ఎం సురేందర్‌రెడ్డి, నాయకులు సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, సిరాజ్‌ఖాద్రీ వినో ద్‌కుమార్, అనిత మధు సూదన్‌రెడ్డి, సీజే బెనహర్, ఎన్‌పీ వెంకటేశ్, పసుల రాజు, గుమాల్ శ్రీనివాస్, అజ్మత్‌అలీ, సీజే పూజిత, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.