Share News

విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:28 PM

విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్‌రెడ్డి చెలగాటం ఆడు తున్నారని, అనాలోచిత నిర్ణయంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని బీఆర్‌ఎస్‌ వీ కోఆర్డినేటర్‌ కుర్వ పల్లయ్య విమర్శించారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు
గద్వాల కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులు, బీఆర్‌ఎస్‌వీ నాయకులు

  • జీఓ నెం 97ను వెంటనే రద్దు చేయాలి

  • 4గంటలు ధర్నా చేసిన పాలిటెక్నిక్‌ విద్యార్థులు

గద్వాల,ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్‌రెడ్డి చెలగాటం ఆడు తున్నారని, అనాలోచిత నిర్ణయంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని బీఆర్‌ఎస్‌ వీ కోఆర్డినేటర్‌ కుర్వ పల్లయ్య విమర్శించారు. గురువారం జీఓ నెం 97ను రద్దు చేయాలని కోరుతూ జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట పాలిటెక్నిక్‌ విద్యార్థులతో కలిసి నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్‌ వలన మూడేళ్ల పాలిటెక్నిక్‌ చదువు వృథా అవు తున్నదని అన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పేరుతో జీఓ నెం 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్య త తగ్గుతుందన్నారు. కొత్త స్కీమ్‌ వలన సాంకేతిక విద్యా మండలి స్వతంత్రత దెబ్బతింటుంద ని డిప్లొమా సాధారణ శ్రామిక శిక్షణగా మా రుస్తున్నాడని విమర్శించారు. అనుసంధానం చేసే జీఓను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. పాల్‌టెక్నిక్‌ కోర్సులను స్కీల్‌ యూనివర్సీటీలోకి తెస్తే తమకు తీవ్ర అన్యా యం జరుగుతుందని దీనిని రద్దు చేసే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ధర్నాలో విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

  • వడ్డేపల్లి, (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ విద్యను శక్తి పాలసీలో అనుసంధానం చేయడం తగద ని, ఎస్‌బీటీఈటీ వ్యవస్థను యధావిధిగా కొన సాగించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా అన్నారు. ప్రభుత్వం తన ఆలోచన ను విరమించుకుని జీవో నెం.97ను వెంటనే ర ద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. శక్తి పాలసీ లో పాలిటెక్నిక్‌ విద్యను కలపడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం వడ్డేపల్లి పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - Aug 20 , 2026 | 11:28 PM