Share News

ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చొద్దు

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:24 PM

ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చవద్దని డిమాండ్‌ చేస్తూ బీసీ ఏ కులాల నాయకులు సోమవారం నర్వలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చొద్దు
నర్వ అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆందోళన చేస్తున్న బీసీ-ఏ కులాల నాయకులు

నర్వ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చవద్దని డిమాండ్‌ చేస్తూ బీసీ ఏ కులాల నాయకులు సోమవారం నర్వలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన తెలిపిన నాయకులు అనంతరం పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్ర జావాణిలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ -ఏలోకి మార్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రజక, వాల్మీకి, మంగలి, వడ్డెర, మేడర కులాల నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను అమలు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ-ఏ వర్గంలోని కులాల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జగన్నాథం, అయ్యన్న, గడ్డం నరసింహ, నీరాజ్‌, బొజ్జన్న, లింగన్న, రఘు తదిత రులున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:24 PM