Share News

రైతులను తప్పుదోవ పట్టించొద్దు

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:47 PM

ప్రతిపక్షాలు ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే పనులు మానుకోవాలని మంత్రి జూప ల్లి కృష్ణారావు సూచించారు.

రైతులను తప్పుదోవ పట్టించొద్దు
నార్లాపూర్‌ నుంచి నీటిని విడుదల చేస్తున్న మంత్రి జూపల్లి

- రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటి విడుదల

- పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

కొల్లాపూర్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ప్రతిపక్షాలు ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే పనులు మానుకోవాలని మంత్రి జూప ల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశానుసారం నార్లా పూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఎల్లూరు రిజర్వాయ ర్‌కు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సం దర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. అదనపు ఆయకట్టు, తాగునీటి సరఫ రాపై పూర్తి వివరాలను వెల్లడించారు. అంతే కా కుండా ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార విమర్శ లు, సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన మండిపడ్డారు. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు లక్ష ఎకరాలకు సరిపోయే నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా ఎల్లూరు రిజర్వాయర్‌ స్లూయిస్‌, గేట్లు అన్ని ఓపెన్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంజీకే ఎల్‌ఐలో భాగంగా కల్వకుర్తి, అచ్చంపేట, నాగ ర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, వనపర్తి నియోజక వర్గా లకు గతంలో ఇస్తున్న 3.5 లక్షల ఎకరాలతో పాటు అదనంగా మరో లక్ష ఎకరాలకు సాగు నీరు అందనుందని ఆయన స్పష్టం చేశారు. నా డు నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం చేసినప్పు డే ఈ ఐదు మోటార్లు నడిచి అదనంగా మరో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. మిషన్‌ భగీరథ కింద తలెత్తుతున్న నీటి ఎద్దడిని నివారించడానికి, అదనపు మోటార్లను నడిపించే ఏర్పాటు చేశా మని, కొల్లాపూర్‌ మునిసిపాలిటీతో పాటు సింగో టం రిజర్వాయర్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా అదనంగా తాగునీరు అందించే ప్రయ త్నం చేస్తున్నట్లు జూపల్లి చె ప్పారు. పాలమూరు మోటార్లు ఆన్‌ చేసి రెండు రోజులకే చే తులు ఎత్తేసిండ్రు అని తమ సొంత పత్రికల్లో రాయించారని, అలాంటి నాయకులకు దమ్ముం టే ఇక్కడికి రావాలని, మీ చే తులతోనే మోటార్‌లు ఆన్‌ చేసి నీళ్లు ముందుకు తీసుకునిపో యి చూపించాలని సవాల్‌ చే శారు. నార్లాపూర్‌ నుంచి ఏదు ల వరకు ప్యాకేజీ 3 కాలువ తవ్వకం పనులు పదేళ్లలో పూ ర్తి చేయకుండా వదిలేసింది గత పాలకులేనని ఆరోపించారు. ప్రస్తుతం అక్కడ హార్డ్‌రాక్‌ తొల గించే పనులు, వంతెనల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని, కాలువ తవ్వకుండా నీళ్లు ముందుకు ఎలా పోతాయని ప్రశ్నించారు. కాం గ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో రైతులకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని చెప్పారు. అంతకుముందు ఇరిగే షన్‌, మిషన్‌ భగీరథ అధికారులతో మంత్రి జూ పల్లి సాగు, తాగునీటి విడుదలపై చర్చించారు. మంత్రి వెంట కొల్లాపూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ రెడ్డి జ్యోతి, వైస్‌చైర్మన్‌ షేక్‌ రహీంపాషా, కౌన్సి లర్లు, ఇరిగేషన్‌ ఈఈ, డీఈ, మిషన్‌ భగీరథ ఈఈ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2026 | 11:47 PM