Share News

పేదరికం కారణంగా విద్యకు దూరం కావొద్దు

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:10 PM

ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చే రుకుంటారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పేదరికం కారణంగా విద్యకు దూరం కావొద్దు
విద్యావలంటీర్లకు చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలి

- ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- విద్యావలంటీర్లకు రూ.10 లక్షల చెక్కుల అందజేత

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చే రుకుంటారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పేదరికం కారణంగా వి ద్యార్థులు విద్యకు దూరం కావద్దన్నారు. శత శాతం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరచాలని 100 మంది విద్యావలంటీర్లను నియమించుకు న్న సంగతి తెలిసిందేననాన్నరు. ఈ మంచి కా ర్యక్రమంలో తామూ భాగస్వామ్యం అవుతామ ని అమర్‌రాజా కంపెనీ యాజమాన్యం ముం దుకు వచ్చిందన్నారు. బుధవారం నగరంలో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100 మం ది విద్యావలంటీర్లకు రూ.10 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఎంసెట్‌, నీట్‌ కోచింగ్‌లకు సంపూర్ణ సహకారం అందిస్తున్న నగరంలోని రిషి కళాశాల, వాగ్దేవి కళాశాల, ప్రతిభ కళాశా లల కరస్పాండెంట్‌లను ఆయన అభినందిం చారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వి ద్యార్థులలోని ప్రతిభను గుర్తించి అందుకు త గ్గట్టు నైపుణ్యాలను తీర్చిదిద్దేందుకు వలంటీర్లు వారికి శిక్షణ ఇస్తారన్నారు. గతేడాది 35 పాఠ శాలలో విద్యావలంటీర్లను నియమించి మంచి ఫలితాలను సాధించామని, ఈ ఏడాది 100 పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించిన ట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 45 పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు గౌరవవేతనం ఇచ్చేందుకు అమర్‌రాజా, రాజన్న ఫౌండేషన్‌లు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యాశాఖ అధికారి విజయకుమారి, అమర్‌రాజా వైస్‌ ప్రెసిడెంట్‌ నిరంజన్‌రెడ్డి, రాజన్న ఫౌండేషన్‌ సతీష్‌, ఎంఎంఓ దుంకుడు శ్రీనివాస్‌, నాయకులు బెనహర్‌, గోవర్దన్‌గౌడ్‌, ప్రతిభ కళాశాల కరస్పాండెంట్‌ విజేత వెంకట్‌రెడ్డి, రిషి జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ వెంకటయ్య, ప్రతిభ కళాశాల డైరెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఫస్ట్‌ పర్యవేక్షకులు గుండా మనోహర్‌, వందేమాత రం ఫౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 11:10 PM