Share News

ఫిర్యాదులు పెండింగ్‌ పెట్టొద్దు

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:49 PM

ప్రజావాణికి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పెండింగ్‌ పెట్టొద్దని అదనపు కలెక్టర్‌ నర్సింగరా వు అన్నారు.

ఫిర్యాదులు పెండింగ్‌ పెట్టొద్దు
అర్జీలను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

గద్వాల/గద్వాల క్రైం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పెండింగ్‌ పెట్టొద్దని అదనపు కలెక్టర్‌ నర్సింగరా వు అన్నారు. సోమవారం గద్వాల కలె క్టరేట్‌లో భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ కృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌ కుమార్‌రెడ్డి, రాజ్‌ కుమార్‌లతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. ప్ర తీ బుధవారం అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం చూ పాలని ఆదేశించారు. ప్రజావాణికి అధికారులు అందరూ సకాలంలో హాజరు కావాలని సూచిం చారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దివ్యాంగులకు సంబంధించిన పో స్టుల ఖాళీల వివరాలు, రోస్టర్‌ పాయింట్స్‌ రిజిష్టర్‌లను ఆయా శాఖల వారీగా ఈనెల 30వ తేదీలోగా సంక్షేమ శాఖ కార్యాలయంలో అంద జేయాలని సూచించారు. అదేవిధంగా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 11 ఫిర్యాదులు అందిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడు తూ ప్రజల నమ్మకం పోలీస్‌ శాఖకు అత్యంత ముఖ్యం. అందుకే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

Updated Date - Sep 28 , 2026 | 11:49 PM