తాగునీరు, ఆహార నాణ్యతలో రాజీపడొద్దు
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:07 PM
గురుకుల విద్యార్థులకు అన్నిసౌకర్యాలు నాణ్యతతో కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు.
విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణం కల్పించాలి
పరమాల గ్రామంలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
గద్వాల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యార్థులకు అన్నిసౌకర్యాలు నాణ్యతతో కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు. సోమవారం మండలంలోని పరమాల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, విద్యార్థుల వసతిగృహాలు, వంటశాల, భోజనశాల, తాగునీటి సౌక ర్యం, విద్యార్థులకు అందిస్తున్న భోజనంనాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. తాగునీరు, ఆహార నాణ్యత లో రాజీ పడవద్దని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూ చించారు. ఎక్కడ నిర్లక్ష్యానికి తావు ఇవ్వద్దని అన్నారు. విద్యార్థుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన అదనపు కలెక్టర్ వారికి అందుతున్న విద్యాబోధన, వసతి, భోజనం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా నోట్‌పుస్తకాలు, బెడ్‌షీట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.