Share News

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దు

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:20 PM

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అసత్వం వహించొద్దని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దు
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఖుష్భూ గుప్తా

- కలెక్టర్‌ ఖుష్భూ గుప్తా

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అసత్వం వహించొద్దని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 100 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి నిర్వహిస్తున్నామని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, డీఆర్వో నిర్మల, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ రాంరెడ్డి, జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:20 PM