Share News

స్టార్‌ హోటళ్లను మరిపించేలా వంటకాలు

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:29 PM

స్టార్‌ హోటళ్లను మరిపించేలా మధ్యాహ్న భోజ న పథక కార్మికుల వంటకాలున్నాయని డీసీఈ బీ కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు.

స్టార్‌ హోటళ్లను మరిపించేలా వంటకాలు
విజేతలతో డీసీఈబీ కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు

  • డీసీఈబీ కార్యదర్శి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు

  • గద్వాలలో మధ్యాహ్న భోజన పథకం జిల్లా స్థాయి వంటల పోటీలు

  • మొదటి స్థానంలో గద్వాల బాలుర ఉన్నత పాఠశాల ఏజెన్సీ

గద్వాల సర్కిల్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): స్టార్‌ హోటళ్లను మరిపించేలా మధ్యాహ్న భోజ న పథక కార్మికుల వంటకాలున్నాయని డీసీఈ బీ కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు. గద్వాల లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆ దివారం డీఈవో విజయలక్ష్మి ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథక వంట కార్మికులకు జి ల్లాస్థాయి వంట పోటీలు నిర్వహించారు. జిల్లా లోని పలు ఏజెన్సీలకు సంబంధించిన వంట కార్మికులు పోటీలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలో గద్వాల ప్రభుత్వ బాలు ర ఉన్నత పాఠశాల ఏజెన్సీ నుంచి పద్మ ప్రథ మ స్థానం, మల్దకల్‌ మండలం అమరవాయి జడ్పీహెచ్‌ఎస్‌ ఏజెన్సీ నుంచి గోవర్ధనమ్మ ద్వితీయ స్థానం, ఇటిక్యాల మండలం మునుగాల జడ్పీహెచ్‌ఎస్‌ నుంచి సరస్వతీ, రాజోలి మండలం పెద్దధన్వాడ యూపీఎస్‌ నుంచి మాధవి తృతీయ స్థానంలో నిలిచారు. వంట కార్మికులు తయారు చేసిన వంటకాల రుచులతో పాటు పరిశుభ్రత, సమయం, నాణ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని న్యాయ నిర్ణేత లు విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీసీఈబీ కార్యదర్శి, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌లు మాట్లాడుతూ పోటీ పడి చేసిన వంటకాలు చాలా రుచిగా ఉన్నాయని ప్రశంసించారు. విద్యార్థుల కు కూడా ప్రతి రోజు ఇదే విధంగా వంటకాలు చేయాలని సూచించారు. పోటీలో పాల్గొన్న పో టీదారులు స్టార్‌ హోటళ్ల చెఫ్‌లను తలపించార ని పేర్కొన్నారు. మొదటి స్థానంలో నిలిచిన పద్మను ప్రత్యేకంగా అభినందించి రాష్ట్ర స్థాయి లో ఇంతకు మించి వంటకాలు తయారు చేసి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈవో కార్యాలయ పర్యవేక్షకు డు వీరశేఖర్‌, జీహెచ్‌ఎం మహేష్‌, న్యాయనిర్ణేతలు యువతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:29 PM