మూడు చేనేత సొసైటీల్లో డైరెక్టర్లు ఏకగ్రీవం
ABN , Publish Date - Jul 06 , 2026 | 11:25 PM
చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా గద్వాల పట్టణంలోని మూడు సొసైటీలకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
మరో సొసైటీకి 10న పోలింగ్
గద్వాల టౌన్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా గద్వాల పట్టణంలోని మూడు సొసైటీలకు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలో నాలుగు చేనేత సహకార సంఘాలు ఉండగా, ప్రధాన సొసైటీగా చెప్పుకునే గద్వాల చేనేత సహకార సంఘానికి ఈనెల 10న ఎన్నికలు జరగనున్నాయి. తొమ్మిది మంది సభ్యులు గల ఈ సొసైటీలో ఇరవై మంది అభ్యర్థులు పోటీలో ఉం డగా పోలింగ్ అనివార్యమైంది. ఏడుగురు పురుష డైరెక్టర్ స్థానాల కోసం 16మంది బరిలో ఉండగా, మహిళ కోటాలోని రెండు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారి మహేశ్ తెలిపారు. సోమవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన అనంతరం ప్రియదర్శిని మహిళ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి డైరెక్టర్లుగా బుదారపు సత్యమ్మ, కె.చంద్రకళ, ఎం.గౌరమ్మ, అక్కల పద్యావతి, జయశ్రీ, జయమ్మ, వేదమ్మ, రావూస్ మాధవి, బిజ్జె సునీత ఎన్నికైనట్లు అధికారి రాఘవేంద్రరావు ప్రకటించారు. రాఘవేంద్ర సిల్క్ వీ వర్స్ సొసైటీకి డైరెక్టర్లుగా ఎక్బోటే నవీన్, ఏ.కుమార్, కోట లక్ష్మణ్, దేవూజీ రాఘవేందర్, బుదారపు కృష్ణ, సాక్రె సురేశ్, సూరశ్రీకాంత్‌తో పాటు మహిళ కోటాలో కె.రేణుక, గడ్డం అనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారి శ్రీనివాసులు తెలిపారు. రాజరాజేశ్వరి సొసైటీకి అక్కల శ్రీనివాసులు, ఎక్బోటే సురేశ్, ఏరువ ఊషన్న, పుట్ట వేణుగోపాల్, బండారి శ్రీనివాసులు, మంత్రి సురేశ్, వగ్గు శివకుమార్, మహిళ కోటాలో కొంకతి హరిత, చిలువేరి విజయలక్ష్మి డైరెక్టర్లుగా ఎన్నికయ్యారని అధికారి శ్రీధర్‌గౌడ్ తెలిపారు.