Share News

డిజిటల్‌ వనరులను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:32 PM

నారాయణపేట జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు అందిస్తున్న సహకారాన్ని పాఠశాలలు వినియోగించుకోవా లని కలెక్టర్‌ ప్రియాంక తెలిపారు.

డిజిటల్‌ వనరులను వినియోగించుకోవాలి
పాఠశాలలో డిజిటల్‌ విద్యాబోధన కోసం ఉపాధ్యాయులకు ల్యాప్‌టాప్‌ను అందిస్తున్న కలెక్టర్‌ ప్రియాంక

- కలెక్టర్‌ ప్రియాంక

- జిల్లాలోని 29 పాఠశాలలకు 190 ల్యాప్‌టాప్‌ల పంపిణీ

నారాయణపేట రూరల్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు అందిస్తున్న సహకారాన్ని పాఠశాలలు వినియోగించుకోవా లని కలెక్టర్‌ ప్రియాంక తెలిపారు. మంగళవారం నారాయణపేట మండలంలోని జాజాపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో సేవాభారతి ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్‌ ఇన్షియేటివ్‌ డిజిటల్‌ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 29 ఉన్నత పాఠశాలలకు ల్యాప్‌ట్యాప్‌లు, డిజిటల్‌ విద్యా సామగ్రిని కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవాభారతి సంస్థను కలెక్టర్‌ అభినం దించారు. గతంలో ప్రారంభమైన ల్యాప్‌ట్యాప్‌ల అందజేత కార్యక్రమం కొంతకాలం సమన్వయ లోపంతో ముందుకు సాగలేదన్నారు. పాఠశాలలకు అందించిన డిజిటల్‌ సామగ్రిని విద్యార్థుల అభ్యసనకు నిరంతరం వినియోగించాలని హెచ్‌ఎంలకు, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, ఎంఈ వో బాలాజీ, పాలమూరు సేవాభారతి సభ్యులు రాందేవ్‌రెడ్డి, కిషన్‌జీ, సర్పంచ్‌ సంగీతరాములు, ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌, హెచ్‌ఎం భారతి, ఆర్‌ఎస్‌ఎస్‌ పాలమూరు కార్యవహ మ్యాడం ప్రభాకర్‌, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:32 PM