సర్పంచ్ ఎన్నికల్లో ఓటెయ్యలేదని..
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:44 PM
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ వర్గానికి చెందిన వారు ఓటు వేయలేదని ఆ కుటుంబంలో మృతి చెం దిన వృద్దురాలి మృతదేహాన్ని తమ పొలంలో ఉన్న శ్మశానవాటికలో పూ డ్చడానికి వీలు లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
- అంత్యక్రియలకు ఆటంకం
- గట్టు మండలం సల్కాపురం లో ఘటన
గట్టు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ వర్గానికి చెందిన వారు ఓటు వేయలేదని ఆ కుటుంబంలో మృతి చెం దిన వృద్దురాలి మృతదేహాన్ని తమ పొలంలో ఉన్న శ్మశానవాటికలో పూ డ్చడానికి వీలు లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. జోగుళాంబ గ ద్వాల జిల్లా గట్టు మండలంలోని సల్కాపురంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓట మిపాలైన బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కుటుంబసభ్యులు చా కలి సవరమ్మ (93) అంత్యక్రియలకు శుక్రవారం అభ్యంతరం వ్యక్తం చే శారు. గురువారం ఇదే గ్రామానికి చెందిన రేషన్ డీలర్ తల్లి మృతి చెంది తే ఇదే స్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే గురువారం లేని అ భ్యంతరం శుక్రవారం ఎందుకొచ్చిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. విషయం కాస్త ఎస్‌ఐ కేటీ మల్లేష్, తహసీల్దార్ విజయ్‌కుమార్ దృష్టికి చేరింది. అ ప్రమత్తమైన వారు పోలీసులతో పాటు, కార్యదర్శి గ్రామానికి చెరుకుని రెండు వర్గాల వారితో చర్చించారు. అధికారులు చర్చల అనంతరం అం త్యక్రియలు నిర్వహించుకునేందుకు సమ్మతి తెలియజేశారు. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలను పూర్తి చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా సమస్యకు శ్వాశ్వత పరిష్కారం చూపించాలని సల్కాపురం గ్రామస్థులు అధికారులను కోరారు.