Share News

పోలీసులు నా భార్యను దాచారు?

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:21 PM

పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరుగకపోగా తన భార్యను ఓ కాని స్టేబుల్‌ వశపరుచుకున్నాడ ని, ఇందులో ఆ కానిస్టేబుల్‌ చెప్పినట్లే ఎస్‌ఐ తనపై కేసు నమోదు చేయడమే కాకుండా తనపై దాడి చేశాడని పెట్రోల్‌ బాటిల్‌తో భార్య వాటర్‌ట్యాంకు ఎక్కిన ఘటన జిల్లా కేంద్రంలో గురువా రం చోటు చేసుకుంది.

పోలీసులు నా భార్యను దాచారు?
పెట్రోల్‌ బాటిల్‌తో వాటర్‌ ట్యాంకుపై నిలబడిన నరేశ్‌చారి

- పెట్రోల్‌ బాటిల్‌తో ట్యాంకు ఎక్కిన భర్త

గద్వాల క్రైం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరుగకపోగా తన భార్యను ఓ కాని స్టేబుల్‌ వశపరుచుకున్నాడ ని, ఇందులో ఆ కానిస్టేబుల్‌ చెప్పినట్లే ఎస్‌ఐ తనపై కేసు నమోదు చేయడమే కాకుండా తనపై దాడి చేశాడని పెట్రోల్‌ బాటిల్‌తో భార్య వాటర్‌ట్యాంకు ఎక్కిన ఘటన జిల్లా కేంద్రంలో గురువా రం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రెండవ రై ల్వేగేట్‌ సమీపంలో నివాసం ఉంటున్న నరేష్‌చారి భార్యతో కొన్ని రోజులుగా తగాదాలు జరుగుతుండడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయంలో పోలీసులు తమకు నచ్చచెప్పి గొడవలు సద్దుమనిస్తారనుకుంటే పట్టణ ఎస్‌ఐ ఫి ర్యాదు తీసుకోలేదని, అదేక్రమంలో తన భార్యను ఏఆర్‌ కానిస్టేబుల్‌ పరిచయం పెంచుకొని ఎస్‌ఐతో తనపై కేసును పెట్టించడం జరిగిందన్నారు. తనకు న్యా యం చేయాలని ఈ నెల 18న వాటర్‌ట్యాంక్‌ ఎక్కగా, పోలీసులు న్యాయం చే స్తామని హామీ ఇవ్వడంతో విరమించుకున్నాడు. వారం గడిచిన పోలీసులు ప ట్టించుకోవడం లేదని, తన భార్యను పోలీసులే దాచారని, అయితే తన భార్య ఎ క్కడుందో ఏఆర్‌ కానిస్టేబుల్‌కు మాత్రమే తెలుసని ఇందులో ఓ పోలీస్‌ అధికారి కూడా కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అ లంపూర్‌ సీఐ ప్రదీప్‌, పట్టణ ఎస్‌ఐలు కుమార్‌, జహంగీర్‌, రూరల్‌ ఎస్‌ఐ శ్రీ కాంత్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు ఫైర్‌ సిబ్బందిని ట్యాంక్‌పై నుం చి కిందకు దించే ప్రయత్నం చేశారు. తన కాపురం నాశనం కావడానికి పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ బాలు కారణమన్నారు. చివరకు అలంపూర్‌ సీఐ నచ్చజెప్పి ఆదివారం భార్యను తప్పక పిలిపిస్తామని హామీ ఇవ్వడంతో ట్యాంక్‌పై నుంచి కిందకు దిగాడు.

Updated Date - Jun 25 , 2026 | 11:21 PM