Share News

యశోదారెడ్డి రచనల్లో మాండలిక సొగసు

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:46 PM

యశోదారెడ్డి సాహిత్యంలో తెలంగాణతనం, మాండలిక సొగసు నిండి ఉన్నాయని వక్తలు కొనియాడారు.

యశోదారెడ్డి రచనల్లో మాండలిక సొగసు
డాక్టర్‌ కొండపల్లి నిహారిణికి ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారాన్ని అందిస్తున్న నిర్వాహకులు, ముఖ్య అతిథులు, కవులు, కవయిత్రులు

- సమగ్ర సాహిత్య సమాలోచన సదస్సులో వక్తలు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : యశోదారెడ్డి సాహిత్యంలో తెలంగాణతనం, మాండలిక సొగసు నిండి ఉన్నాయని వక్తలు కొనియాడారు. పాకాల యశోదరెడ్డి 97వ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పిల్లలమర్రి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సా హితీ సమాలోచనా సదస్సు రెండవ రోజు సోమవారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కవులు, రచయితలను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ, ఉపాధ్యక్షురాలు జి. శాంతారెడ్డి, భారతి గౌరవ సంచాలకులు చుక్కాయపల్లి శ్రీదేవి, మేకల అనురాధ, ప్రముఖ విమర్శ కులు శ్రీనివాసాచారి, కళాశాల ప్రిన్సిపాల్‌ జయప్రద ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. యశోదారెడ్డి కుమార్తె పాకాల లక్ష్మీరెడ్డి, మనమరాలు చైత్రారెడ్డి ప్రసం గించారు. ముఖ్య అతిథులుగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి, ప్రముఖ రచయిత నాళేశ్వరం శంకరం, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ నామాజు బాలాచా రి, ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ డీన్‌ పులికొండ సుబ్బాచారి పాల్గొన్నారు. హైదరా బాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, ప్రముఖ న్యాయవాది వల్లపురెడ్డి మనో హర్‌రెడ్డి, చందోజిరావు, పాలమూరు విశ్వ విద్యాలయం పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షులు మన్నెమోని కృష్ణయ్య ప్రసంగించారు. అనంతరం యశోదారెడ్డి రచించిన కథా చరిత్ర పునర్ముద్రిత పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహితీ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కవులు, మహిళలకు పురస్కారాలు ప్రదానం చేశారు. పోల్కంపల్లి శాంతాదేవికి ఆచార్య పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారం, ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారాన్ని డాక్టర్‌ కొండపల్లి నిహారిణికి అందించారు. సదస్సు విజయవంతానికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించిన కళాశాల అధ్యాపక బృందం, సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 11:46 PM