Share News

ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:25 PM

ఉమామహేశ్వర బ్రహ్మోత్పవాలతో పాటు, నిరంజన్‌ షావలి ఉర్సు అచ్చంపేట మండలం రంగాపూర్‌ గ్రామంలో భక్తులు భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు.

ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు
నిరంజన్‌ షావలికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు

- జనసంద్రంగా మారిన ఉమామహేశ్వర గిరులు

- నిరంజన్‌షావలికి మొక్కులు చెల్లించేందుకు వస్తున్న భక్తులు

అచ్చంపేట, జనవరి 18 (ఆంద్రజ్యోతి) ఉమామహేశ్వర బ్రహ్మోత్పవాలతో పాటు, నిరంజన్‌ షావలి ఉర్సు అచ్చంపేట మండలం రంగాపూర్‌ గ్రామంలో భక్తులు భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవాలలో హిందూ, ముస్లింలు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుంటారు. వారం రోజుల పాటు జరిగే జాతరలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. కాగా, అచ్చంపేట- శ్రీశైలం రహదారి భ క్తుల వాహనాలతో కి క్కిరిసిపోయింది.

నందివాహనంపై ఊరేగిన ఉమామహేశ్వరుడు

ఉమామహేశ్వర క్షేత్రంలో ఆదివారం గవ్యాతపూజలు, అమ్మవారికి అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన రుద్రాభిషేకం రుద్రహోమం సాయంత్రం సాయమౌపాసన, శ్రీసూక్త దుర్గా హోమాలు, నందివాహనంపై క్షేత్ర పుర వీధు ల గుండా బాజా భజంత్రీల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్ప తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. స్వామి వారిని దర్శించుకునేందు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు బారులు తీరారు.

దర్గాను దర్శించుకున్న భక్తులు

గంధోత్సవం ముగిసిన తరువాత భక్తులు నిరంజన్‌షావలీ దర్గాను దర్శించుకొని ప్రత్యేక ఫాతేహాలు ఇచ్చి ప్రార్థనలు చేశారు. ట్రాక్టర్లు, కార్లు, జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలలో ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. జాతరలో పిల్లలను ఆకర్షించే జాయింట్‌ వీల్‌, డ్యాన్సింగ్‌ డాల్‌, ట్రేన్‌ట్రాక్‌ తదితర వినోదాత్మకమైన వాటిని ఆస్వాదిస్తున్నారు

Updated Date - Jan 18 , 2026 | 11:25 PM