అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:13 PM
ప్ర భుత్వం అందించిన ప్రత్యేక నిధుల ద్వారా చేప ట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చే యాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూ చించారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
గద్వాలటౌన్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్ర భుత్వం అందించిన ప్రత్యేక నిధుల ద్వారా చేప ట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చే యాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూ చించారు. పట్టణంలోని 17వ వార్డు ద్వారకానగ ర్‌లో సీసీ రోడ్డు, పదవ వార్డు పరిధిలో డ్రైనేజీ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే భూ మిపూజ చేశారు. ఈసందర్బంగా మాట్లాడిన ఎ మ్మెల్యే, పట్టణ అభివృద్ధి కోసం తాము చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.18.70 కోట్లు మంజూరు చేశారన్నారు. భవిష్యత్‌లో ప ట్టణ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు సాధించేం దుకు కృషి చేస్తాననన్నారు. చేపట్టిన పనులు నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తిచేసి ప్ర జలకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేయాలన్నారు. కార్యక్రమం లో మునిసిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్, మా జీ కౌన్సిలర్లు అలియాబేగం, శ్రీనుముదిరాజ్, నా యకులు బండారి భాస్కర్, విజయ్, రాజశేఖర్, షుకూర్, వీరన్నగౌడ్, రిజ్వాన్, నాగశంకర్ తదితరులు ఉన్నారు.