Share News

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:14 PM

జిల్లాలోని మహబూబ్‌నగర్‌ పురపాలిక సంస్థ, జడ్చర్ల, దేవరకద్ర, భూత్పుర్‌ మునిసిపాలిటీల్లో టీయూఎఫ్‌ఐడీసీ, యూఎఫ్‌సీ నిధుల కింద చేపడుతున్న అభివృద్ధి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

- కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని మహబూబ్‌నగర్‌ పురపాలిక సంస్థ, జడ్చర్ల, దేవరకద్ర, భూత్పుర్‌ మునిసిపాలిటీల్లో టీయూఎఫ్‌ఐడీసీ, యూఎఫ్‌సీ నిధుల కింద చేపడుతున్న అభివృద్ధి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలోని ఆమె చాంబర్‌లో మునిసిపల్‌ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ మునిసిపాలిటీలో వ్యర్ధాల శుద్ధి (వెస్ట్‌ట్రీట్‌మెంట్‌) ప్లాంట్ల ఏర్పాటు, లెగసీ వ్యర్థాల తొలగింపునకు చేపడుతున్న బయో మైనింగ్‌ పనులు, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, తాగునీటి సరఫరా అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే టీయూఎఫ్‌ఐడీసీ, యూఎఫ్‌సీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు వెంటనే గ్రౌండింగ్‌ చేసి, ఎక్కడ జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి, జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూర్‌ మునిసిపల్‌ కమిషనర్లు గిరీష్‌, నరేష్‌, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:14 PM