Share News

బ్రహ్మోత్సవాల కోసం చురుగ్గా అభివృద్ధి పనులు

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:33 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలో పేదల తిరుప తిగా విరాజిల్లుతున్న కురుమూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు త్వరలో ప్రారంభం కానుండటంతో అధికారులు భక్తులకు అవసరమైన ఏ ర్పాట్లను చేస్తున్నారు.

 బ్రహ్మోత్సవాల కోసం చురుగ్గా అభివృద్ధి పనులు
రాజగోపురం ఎదుట నిర్మించిన షెడ్డు

- తాగునీటికి ఏర్పాట్లు 8 అందుబాటులోకి దిగుడు మెట్లు

చిన్నచింతకుంట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలో పేదల తిరుప తిగా విరాజిల్లుతున్న కురుమూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు త్వరలో ప్రారంభం కానుండటంతో అధికారులు భక్తులకు అవసరమైన ఏ ర్పాట్లను చేస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే ఇప్పటికే రూ.50 లక్షల ముడా ప్రత్యేక నిధులతో కోనేరు సమీపంలో దాసంగాల షెడ్డు, రాజగోపురం ఎదు రుగా మరో షెడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. రూ. 25 లక్షల వ్యయంతో జాతర మైదానంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నిధులతో నాలుగు హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ. 10 లక్షల వ్యయంతో 30 మీటర్ల మేరకు ది గుడు మెట్లను భక్తుల సౌకర్యార్థం సిద్ధం చేశారు. అలాగే రూ. 8 లక్షల వ్యయంతో దేవస్థాన కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భక్తుల తాగునీటి వసతికోసం ఆలయ నిధులతో జాతర మైదానంలో 12 నల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. కోనేరు సమీపం లోని కల్యాణ కట్ట వద్ద కూడా కొత్త నల్లాల ఏర్పాట్ల పనులు జరుగుతు న్నాయి. అలాగే వాహనాల పార్కింగ్‌ వ్యవస్థను కట్టుదిట్టం చేసేవిధంగా అ ధికారులు ప్రణాళిక రూపొందించారు.

Updated Date - Oct 04 , 2026 | 11:33 PM