జనగణనతోనే అభివృద్ధి ప్రణాళికలు
ABN , Publish Date - May 08 , 2026 | 11:14 PM
జనాభా గణనలో పాల్గొనడం ప్రతీ ఒక్కరి బా ధ్యత అని, పౌరుల ఉజ్వల భవిష్యత్తుకు అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు గణన దోహపడుతుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
గద్వాల న్యూటౌన్, మే 8 (ఆంధ్రజ్యోతి) : జనాభా గణనలో పాల్గొనడం ప్రతీ ఒక్కరి బా ధ్యత అని, పౌరుల ఉజ్వల భవిష్యత్తుకు అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు గణన దోహపడుతుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. జనాభా గణన-2027 కార్యక్రమం లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ నుంచి కృష్ణవేణిచౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ ప్రతీ పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనా భా గణన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న జనాభా గణనలో ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునేందుకు అవకాశం ఉన్నందున అన్నివర్గాల ప్రజలు పెద్దఎత్తున సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, సీపీవో పాపయ్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, యువత, విద్యార్ధులు ఉన్నారు.