సమష్టి కృషితోనే డిపోల అభివృద్ధి
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:33 PM
డిపోలోని ప్రతీ ఉద్యోగి సమ ష్టి కృషితో పని చేసినప్పుడే సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందని డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్స్) కృష్ణమూర్తి అన్నారు.
- డిప్యూటీ ఆర్‌ఎం కృష్ణమూర్తి
- కొల్లాపూర్ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు సన్మానం
కొల్లాపూర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : డిపోలోని ప్రతీ ఉద్యోగి సమ ష్టి కృషితో పని చేసినప్పుడే సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందని డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్స్) కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ ఆర్టీసీ డిపో వార్షిక తనిఖీల్లో భాగంగా విచ్చేసిన ఆయన డిపో మేనేజర్ నీల మణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభకు ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్షేత్ర స్థాయిలో కార్మికులు కష్టపడి పని చేస్తే డిపోలు లాభాల్లోకి వస్తాయని, త ద్వారా రీజియన్‌తో పాటు సంస్థకు మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నా రు. అనంతరం అత్యధిక మైలేజీ సాధించి ఇంధనం పొదుపు చేసిన డ్రైవర్ల ను, అత్యధిక ఇన్సెంటివ్ పొందిన కండక్టర్లు, టిమ్స్‌డ్రైవర్లను మెకానికల్ విభా గంలో ప్రతిభ చూపిన సిబ్బందిని ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ట్రాఫిక్ సూపరింటెండెంట్ రత్నమ్మ, మెకానికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, కార్యాలయ సూపరింటెండెంట్లు నజీర్, రా మాచారి, సీనియర్ అసిస్టెంట్ బీవీఆర్ రెడ్డితో పాటు ట్రాఫిక్, గ్యారేజీ సిబ్బం ది పాల్గొన్నారు.