సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:36 PM
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతోనే పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
- మండల సమావేశంలో ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
దేవరకద్ర, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతోనే పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం దేవరకద్ర మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి నాగమణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, ఉపాధి హామీ, విద్య, వైద్యం, విద్యుత్, హౌసింగ్, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధకశాఖ, ఆర్‌అండ్‌బీ, ఉద్యానవన, ఇరిగేషన్, ఫారెస్టు తదితర శాఖల పురోగతిని అధికారులు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమావేశంలో తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించి, వచ్చే సమావేశంలో సంబంధిత శాఖ అధికారు లు సమాధానం చెప్పాలన్నారు. మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాదారులు యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయిస్తున్నారని సర్పంచులు సభలో తెలిపా రు. ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాదికంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద మర్మతుల కోసం అధికారులు పరిశీలించారని, రూ.4.70 కోట్లు మర్మతులు చేసేం దుకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో 11.6 అడు గుల నీరు వచ్చిందని, పాత అలుగు వరకు వస్తే రైతులకు సాగు నీటిని విడుదల చేస్తామన్నా రు. రైతుల సంక్షేమం కోసం గోదాముల నిర్మాణానికి గ్రామంలో 10 గుంటల భూమిని కేటా యిస్తే, ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తుందన్నారు. మండలంలోని నార్లోని కుంట, బోల్లారం గ్రామాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణా నికి టెండర్లు పూర్తైనట్లు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం నుంచి మంజూరైన జనరేటర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తహసీల్దార్ మహ్మద్ అర్హద్, ఎంపీడీవో శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకం
గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకమని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం కౌకుంట్ల మండల సమీక్ష సమావేశం రైతువేదికలో నిర్వహించగా, అన్ని శాఖల అధికారులు ప్రగతి నివేదికను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయ ఏర్పాటు ప్రభుత్వం నిధులు మం జూరు చేసిందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాల న్నారు. తహసీల్దార్ సుందర్‌రాజ్, ఎంపీడీవో శివప్రసాద్, పాల్గొన్నారు.