జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి పరుగులు
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:44 PM
జోగుళాంబ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి నడిగడ్డలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవ ర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు
సంబురంగా జిల్లా దశాబ్ది ఉత్సవం
గద్వాలటౌన్, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి నడిగడ్డలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవ ర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు. నడిగడ్డను ప్రగతి మార్గంలో న డిపేందుకు బాటలు చేసిన కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారని మాజీ మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ శ్రే ణులు స్థానిక పాతబస్టాండ్ సర్కిల్‌లో దశా బ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించా రు. బాణసంచా పేల్చి సంబురాలు జరుపు కున్న నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పా లాభిషేకం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి కళాశాల సిబ్బందికి గులాబీ మొక్కలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడిన నాయకులు, ఐదో శక్తిపీఠం అ లంపూర్ జోగుళాంబదేవి కొలువైన నడిగ డ్డకు ఆ తల్లి పేరును ఖరారు చేయడం ద్వా రా కేసీఆర్ ఈప్రాంత ప్రజల గుండెల్లో సు స్థిరస్థానం దక్కించుకున్నారన్నారు. కార్యక్ర మంలోనాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాము లు, పల్లయ్య, కౌన్సిలర్లు పులిపాటి వెంకటేశ్, మోహన్‌యాదవ్, చంటన్న, రాములు, నర సింహులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చై ర్మన్ యూసూఫ్, రాము,రామకృష్ణ ఉన్నారు.