కొత్తకోట అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:49 PM
కొత్తకోట మునిసిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నా రు.
కొత్తకోట, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): కొత్తకోట మునిసిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నా రు. సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ సమీపంలోని చెనగచెర్వు కట్టపై అభి వృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజల కు మౌలిక వసతులు సమకూర్చడం కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించా నని తెలిపారు. సంతకు స్థలం లేక చిరువ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతుండటం తో చెనగ చెరువు కట్టను అభివృద్ధి చేసి శాశ్వత పరిష్కారం చూపుతానని అన్నారు. ఇందులో భాగంగానే రూ.5 కోట్లు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. ఈ నిధులతో కట్టపై 15 ఫీట్ల రోడ్డు, ఇరువైపుల పార్కులు, 20 ఫీట్ల స్థలంలో సంత నిర్వహన ఉంటుందని తెలిపారు. పనులు పూర్తి అయ్యాక పట్టణ రూపురేఖలు మారి పోతాయన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనరు సైదయ్య, చైర్‌పర్సన్ అరుణ, వైస్ చైర్‌పర్సన్ పల్లవి, కౌన్సిలర్లు బోయోజ్, రవీందర్‌రెడ్డి, అబ్దుల్ నబీ, మురళీ యాదవ్, చంద్రకాంత్, సంజీవుడు తదితరులు పాల్గొన్నారు.