Share News

బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రంతో దేవరకద్రకు గుర్తింపు

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:07 AM

దేవ రకద్రలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ యూనిట్‌ కేం ద్రం మంజూరు కావడంతో ఈ ప్రాంతానికి ప్రపం చ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలో రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజనశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి, కలెక్టర్‌ ఖుష్భూ గుప్తాతో కలిసి మంత్రి రహదారుల నిర్మా ణం కోసం శంకుస్థాపన చేశారు.

బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రంతో   దేవరకద్రకు గుర్తింపు
దేవరకద్ర: రహదారినిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జీఎంఆర్‌

- విద్య, వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం

- రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

దేవరకద్ర, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేవ రకద్రలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ యూనిట్‌ కేం ద్రం మంజూరు కావడంతో ఈ ప్రాంతానికి ప్రపం చ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలో రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజనశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి, కలెక్టర్‌ ఖుష్భూ గుప్తాతో కలిసి మంత్రి రహదారుల నిర్మా ణం కోసం శంకుస్థాపన చేశారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియోజక వర్గంలో ప్రభుత్వం రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో మహర్దశ కలిగి ఉందన్నా రు. దీంతో రూ. 134.98 కోట్లతో మీనుగోనిపల్లి నుం చి కురుమూర్తి వరకు డబుల్‌ రోడ్డు విస్తరణ పను లకు, అదేవిధంగా రూ.40 కోట్లతో కౌకుంట్ల మండ లంలోని ముచ్చింతల దగ్గర బ్రిడ్జి పనులకు శంకు స్థాపన చేశారు. అనంతరం మంత్రి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరు గైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యంతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. దేవరకద్ర మునిసిపాలిటీ కా ర్యాలయ భవన నిర్మాణం కోసం పురాతన ఆర్‌ అండ్‌బీ అతిథి గృహం దగ్గర కార్యాలయాన్ని నిర్మిం చేందుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు.

తాగునీటిని పొదుపుగా వాడాలి: శ్రీహరి

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్టా తాగునీటి సమస్యలేకుండా ఉం డేందుకు నీటిని పొదుపుగా ఉపయోగించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుతం కృష్ణాన దిలో నీటి లభ్యత తగ్గిందని, జూరాల నుంచి వచ్చే నీరు రామన్‌పాడ్‌, కోయిల్‌ సాగర్‌, మక్తల్‌, పాల మూరు, కొల్లాపూర్‌ ప్రాంతాలకు కీలకమన్నారు. అ నంతరం ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వం చేపడుతున్న పనులతో ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయన్నా రు. కలెక్టర్‌ ఖుష్భూ గుప్తా, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్‌ మధు సూదన్‌నాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ సాయి శివాని, తహసీల్దార్‌ మహ్మద్‌ అర్షద్‌, పుర చైర్‌పర్స న్‌ కొండ దమయంతి, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

పరిశ్రమలు రావాలంటే రోడ్లు బాగుండాలి

చిన్నచింతకుంట, (ఆంధ్రజ్యోతి): పరిశమ్రలు రావాలంటే గ్రామీణ ప్రాంతంలోని రోడ్లు బాగుండాలని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖా మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కౌకుంట్ల మండలంలోని ముచ్చింతల గ్రామంలో దాదాపు 44కోట్ల వ్యయం తో నిర్మించనున్న ఊకచెట్టువాగుపై హైలెవల్‌ వం తెనకు మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ కుష్భూగుప్తాతో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు. అనంతరం కు రుమూర్తి ఘాట్‌రోడ్డు, ఎలివినేటెడ్‌ కారిడార్‌ పను లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ రూ.48కోట్ల వ్యయంతో మూడు మండల సమీకృత కార్యాలయాలకు సముదాయా లను నిర్మించనున్నట్లు, దసరా సందర్బంగా ఈ ప నులకు శంకుస్థాపన చేసి, నవంబరులో పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కురుమూర్తి ఘాట్‌రోడ్డు పనులు వేతగవంతం చేసి, భక్తులకు మెరుగైన సౌఖర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు.

కురుమూర్తి ఆలయ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనుల పరిశీలన

రూ.110 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న కు రుమూర్తి గుట్టమీదకు ఎలివేటెడ్‌ కారిడార్‌, ఘాట్‌ రోడ్డు పనులను మంత్రులు, ఎమ్మెల్యేతో సంబం ధిత ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించారు. పను ల పురోగతిని అధికారులను వారు అడిగి తెలుసు కున్నారు. పనుల్లో వేగం పెంచి గడువులోగా పూ ర్తిచేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

Updated Date - Sep 21 , 2026 | 12:07 AM