Share News

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:51 PM

వర్షా భావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పో తున్నాయి.

అడుగంటుతున్న భూగర్భ జలాలు
కల్వరాలలో ఎండిపోయిన మొక్కజొన్న

- వేధిస్తున్న కరెంటు కోతలు

- ఎండుతున్న పంటలు

- అయోమయంలో రైతులు

వీపనగండ్ల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వర్షా భావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పో తున్నాయి. ఎండల తీవ్రత పెరగడం, విద్యుత్‌ కోతలతో పంటలు కాపాడుకునేందుకు రై తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వన పర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో 13, 250 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మొక్క జొన్న, 1200 ఎకరాల మినుములు, 27 ఎ కరాల్లో కందులు, 850 ఎకరాల్లో వేరు శన గ తదితర పంటలు సాగుచేశారు. కానీ, వర్షాలు కురవకపోవడంతో వర్షాధార పం టలు ఇప్పటికే పూర్తిగా ఎండి పోయాయి. బోరుబావుల కింద సాగుచేసిన పంటలె ౖనా కాపాడుకుందా మంటే భూగర్భ జలా లు పడిపోవడం, విద్యుత్‌ కోతలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజూ 8 గంటలు కూడా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా వీప నగడ్ల, కల్వరాల, సంగినేనిపల్లి, సంపట్రా వ్‌ పల్లి గ్రామాలలో సాగుచేసిన వేరు శనగ, మొక్కజొన్న, సోయాబీన్‌ వంటి పంటలు చేతికి వచ్చే దశలో సాగునీరు అందక ఎండిపోతున్నాయని ఆయా ప్రాం తాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల, భీమా కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేసి పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Sep 16 , 2026 | 11:51 PM