దేశ రాజకీయాల్లోనే దీక్షా దివస్ సంచలనం
ABN , Publish Date - Nov 29 , 2026 | 11:18 PM
తెలంగాణ ఉద్యమంలో నవంబరు 29 దీక్షా దివస్ ఓ మలుపు అని, దీక్షా దివస్ దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.
- కేసీఆర్ పట్టుదలతోనే తెలంగాణ సాధ్యం
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కోస్గి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంలో నవంబరు 29 దీక్షా దివస్ ఓ మలుపు అని, దీక్షా దివస్ దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కోస్గి పట్టణంలోని లక్ష్మినరసింహ ఫంక్షన్ హాల్‌లో బీ ఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్ర మానికి వారు హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్ర భుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోంద న్నారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ కారులను సన్మానించారు. కొడంగల్ నియోజక వర్గంలోని ఆయా మండలాల నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.
మక్తల్‌లో బైక్ ర్యాలీ
మక్తల్ (ఆంధ్రజ్యోతి) : దీక్షా దివాస్‌ను పుర స్కరించుకొని ఆదివారం మక్తల్ పట్టణంలో మా జీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లజానమ్మ ఆలయం నుంచి పురవీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మక్తల్ నియో జకవర్గం అధోగతి పాలైందన్నారు. రాష్ట్రం అప్పు ల ఊబిలోకి పోయిందన్నారు. ఇచ్చిన హామీలు అమలుపర్చడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలం అ యిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీ ఆర్‌ఎస్‌కు తెలంగాణ పార్టీలు పట్టం కడతార న్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శ్రీ నివాస్‌గుప్తా, మహిపాల్‌రెడ్డి, అశోక్‌గౌడ్, సుధాక ర్‌రెడ్డి. ఈశ్వర్, నేతాజీరెడ్డి తదితరులున్నారు.