విద్యార్థి దుర్మరణం
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:39 PM
పాఠశాలకు వెళ్లి అందరి విద్యార్థులతో కలిసి తరగతి గదిలో పాఠాలు విని, సరదాగా తోటి విద్యార్థులతో గడిపిన ఆ విద్యార్ధి మణిదీప్‌కుమార్(14) మధురక్షణాలు రోడ్డు ప్రమాదంతో ఆవిరయ్యాయి.
- ఇద్దరికి గాయాలు
ఎర్రవల్లి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్లి అందరి విద్యార్థులతో కలిసి తరగతి గదిలో పాఠాలు విని, సరదాగా తోటి విద్యార్థులతో గడిపిన ఆ విద్యార్ధి మణిదీప్‌కుమార్(14) మధురక్షణాలు రోడ్డు ప్రమాదంతో ఆవిరయ్యాయి. బడికి వెళ్లి ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న ఆ తల్లితండ్రులకు తీరని పుత్రశోకం మిగిలింది. గ్రామస్థుల కథనం ప్రకారం... గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్‌లోనున్న సాయుధ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మండల పరిధిలోని కొండేరు గ్రామానికి చెందిన బోయ బీచుపల్లి, రాధల కుమారుడు మణిదీప్‌కుమార్ బుధవారం రోజు మాదిరిగా పాఠశాలకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు అదే గ్రామానికి చెందిన యువకులు భరత్, పవన్‌కుమార్‌లు వెళ్తున్న బైక్‌పై లిఫ్ట్ అడిగి ఎక్కాడు. ఎర్రవల్లి చౌరస్తా-కొండేరు గ్రామాల మధ్యన ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌బంక్ దగ్గర గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొట్టడంతో తీవ్రగాయాలపాలైన మణిదీప్‌కుమార్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో భరత్, పవన్‌కుమార్‌లకు గాయాలయ్యాయి. రోజు బడికి వెళ్లి ఇంటికొచ్చే తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. పాఠశాలలో చురుకుగా ఉత్సాహంగా ఉన్న మణిదీప్ మరణం పట్ల తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ సంఘటనపై ఇటిక్యాల పోలిసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.
అతివేగం... బలి తీసుకున్న ప్రాణం
- చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మిడ్జిల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపిన కారు ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన రాములు కుమారుడు బోయ శేఖర్ ఈ నెల 24న తేదీన మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి పొలానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మిడ్జిల్- బోయిన్‌పల్లి బస్టాప్ వద్దకు చేరుకోగానే, వెనుక నుంచి వచ్చిన కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టిందని ఎస్సై శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన శేఖర్‌ను వెంటనే చికిత్సకై హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శేఖర్(43)మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ద్విచక్ర వాహనం కిందపడి..
నవాబ్‌పేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పొలం వద్దకు వెళ్తూ ఓ వ్యక్తి తను నడుపుతున్న ద్విచక్రవాహనం కింద పడి మృతి చెంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పే ట మండలంలోని కొల్లూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విక్రం కథనం ప్రకారం... గ్రామానికి కొలుమల శ్రీను (46) ఈనెల 21న గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలానికి ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వా హనంపై వెళ్తుండగా కాకర్లపాడ్ ఎల్లయ్య పొలం వద్ద వాహనం అదుపు త ప్పి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ స భ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి అక్కడి నుంచి నిమ్స్ అసుపత్రికి త రలించగా నయం కాకపోవడంతో మళ్లీ 24న అతడిని ఇంటికి తీసుకువస్తుం డగా షాద్‌నగర్ సమీపంలోకి రాగాని పరిస్థితి విషమించడంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.