దశమి.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:56 PM
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపు కునే విజయ దశమి పర్వదినం అందరి జీవితా ల్లో నూతన వెలుగులు నింపాలని ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
ధరూర్ మండలం బూరెడ్డిపల్లిలో శమీ వృక్షానికి ఎమ్మెల్యే పూజలు
ఘనంగా విజయ దశమి వేడుకలు
ధరూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపు కునే విజయ దశమి పర్వదినం అందరి జీవితా ల్లో నూతన వెలుగులు నింపాలని ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గం ప్రజలు, రైతులంద రూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టై శ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించిన ట్లు తెలిపారు. విజయదశమిని పురస్కరించుకు ని మంగళవారం రాత్రి ధరూర్ మండలంలోని బూరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి, శమీ పత్రాన్ని ప్రజలకు ఇచ్చి దస రా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజల తో కలిసి శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహం పల్ల కీసేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా సీని యర్ నాయకులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచు విజయ్, గ్రామ పెద్దలు, కార్యకర్తలు ఉన్నారు.