Share News

అప్రమత్తంగా వ్యవహరిస్తేనే సైబర్‌ నేరాలు దూరం

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:21 PM

ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా వ్యవహ రిస్తేనే సైబర్‌ నేరాల బారినపడకుండా ఉంటామని వడ్డేపల్లి ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి, అలంపూర్‌ ఎస్‌ రామకృష్ణ, గట్టు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ చెప్పారు.

అప్రమత్తంగా వ్యవహరిస్తేనే సైబర్‌ నేరాలు దూరం
శాంతినగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ నాగశేఖర్‌ రెడ్డి

  • జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాలు

  • ఆన్‌లైన్‌ మోసాలపై ఫిర్యాదులకు 1930 కి ఫోన్‌ చేయాలని సూచన

వడ్డేపల్లి/అలంపూర్‌/ గట్టు, ఆగస్టు5 (ఆంధ్ర జ్యోతి): ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా వ్యవహ రిస్తేనే సైబర్‌ నేరాల బారినపడకుండా ఉంటామని వడ్డేపల్లి ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి, అలంపూర్‌ ఎస్‌ రామకృష్ణ, గట్టు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ చెప్పారు. ఆయా మండలాల్లో బుధవారం నిర్వహించిన అ వగాహన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. శాంతినగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ రమా ఓబులేసు ఆధ్వర్యంలో, వడ్డేపల్లి పోలీస్‌శాఖ నిర్వహణలో సైబర్‌నేరాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌ఐ మాట్లాడు తూ గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్స్‌, వ్యక్తిగత వివరాలను ఎవ్వరికీ చెప్పరాదన్నారు. ‘ఆగు ఆలోచించు- నిజం నిర్ధారించు -సైబర్‌ భద్రత పెంచు’ వంటి విషయాలపై సంపూర్ణ అవగాహన అవసరమన్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించి 1930కు డయల్‌ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమా ఓబులేషు మాట్లాడుతూ డ్రగ్స్‌ వాడకం వల్ల యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు. ప్రతీఒక్కరు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌ఏ సంపత్‌కుమార్‌, డాక్టర్‌ ఏడుకొండ లు, జీవజయరాజ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ రాఘవేందర్‌, విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:21 PM