ముగ్గులతో సంస్కృతి, సంప్రదాయం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:29 PM
ముగ్గులు అంటే ఇంటి ముందు వేసే అలంకరణ కాదని, మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కళాఖండాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.
- ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్ న్యూటౌన్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ముగ్గులు అంటే ఇంటి ముందు వేసే అలంకరణ కాదని, మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కళాఖండాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ఆము ముఖ్య అతిథిగా హాజరై ముగ్గులను పరిశీలించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి వాణిశ్రీ, ద్వితీయ బహుమతి సుమిత్ర, తృతీయ బహుమతి మహేశ్వరీకి అందజేయగా, పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పాటిస్పెషన్ బహుమతిని అందించారు.
జయరామ చారిటబుల్ ఆధ్వర్యంలో..
పట్టణంలోని జయరామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళలు ముగ్గుల వేయగా, విజేతలకు ట్రస్ట్ చైర్మన్ బెక్కరి రాంరెడ్డి, ఆయన సతీమణి జయలక్ష్మీ బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి శుబాంగి పటేల్‌కు వాషింగ్ మిషన్, ద్వితీయ బహుమతి అరుణశ్రీ కూలర్, తృతీయ బహుమతి సౌజన్య గ్యాస్ స్టౌవ్‌ను అందించారు. ప్రత్యేక బహుమతి మంజులకు రూ.10 వేలు అందించారు.
రామాలయం గుడి..
నగరంలోని టీచర్స్ కాలనీ రామాలయం గుడి వద్ద మైనార్టీ నాయకులు నాయిమ్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి నాగలక్ష్మీ రూ.8 వేలు, ద్వితీయ బహుమతి కృష్ణవేణి రూ.4 వేలు, తృతీయ బహుమతి అలేఖ్య రూ.2 వేలు అందించారు.
అమావాస్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో..
నగరంలోని ఆశోక్ టాకీస్ చౌరస్తాలో గల ఆమావాస్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు సీమ నరేందర్ బహుమతులు ప్రదానం చేశారు.
జడ్చర్ల : జడ్చర్ల మునిసిపాలిటీ విద్యానగర్‌కాలనీలోని తాలుకా క్లబ్‌లో ముగ్గుల పోటీలు నిర్వహించగా, ఎంఈవో మంజులాదేవి, అర్బన్‌హెల్త్ సెంటర్ అధికారి డాక్టర్ మనుప్రియ, పద్మలీల న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు. మాధవరావు కాంపౌండ్‌లో ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందచేశారు. పద్మలీల, బాలమణి, రాధాకృష్ణ, సంజీవ్, గణేష్, వెంకటేశ్, రమ, కిరణ్మయి పాల్గొన్నారు.