విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:34 PM
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి విమర్శించారు.
మిడ్జిల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్ కోతలు, సాగునీటి ఇబ్బందులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని వేముల గ్రామ శివారులోని ఎండిన వరి పంటలను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించి, మాట్లాడారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం, సాగునీరు అందకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు, వ్యవసాయానికి అవసరమైన నీటిని సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయ అధికారులతో పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా కావలి నరేష్
బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్‌నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కిసాన్‌మోర్చా మండల అధ్యక్షుడిగా కావలి నరేష్‌ను నియమించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంబీ బాలకృష్ణ, నాయకులు తిరుపతి, మురళికృష్ణ, వెంకట్‌రెడ్డి, రామకృష్ణ, అరుణ్, వాసుదేవ్, శేఖర్, విష్ణు, ఆంజనేయులు, సహజబేగం, దేవేందర్, మధు, జంగయ్య, లాలు, భీమయ్య పాల్గొన్నారు.