Share News

విద్యుత్‌ కోతలతో ఎండుతున్న పంటలు

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:23 PM

అప్రకటిత విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీ ఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతునాయుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

విద్యుత్‌ కోతలతో ఎండుతున్న పంటలు

  • విలేకరుల సమావేశంలో బాసు హనుమంతునాయుడు

గద్వాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): అప్రకటిత విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీ ఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతునాయుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తన క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని, రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు కూడా విద్యుత్‌ సరఫరా కావడంలేదన్నారు. గట్టులోని విద్యుత్‌ సబ్‌ష్టేషన్‌లో హరీశ్‌రావు పరిశీలించిన లాగ్‌బుక్‌తో ఇది బయటపడిందని చెప్పారు. ప్ర స్తుతం వరి పంట పొట్టదశలో ఉందని, నీళ్లు ఎక్కువగా పారించాల్సిన సమయంలో వి ద్యుత్‌ సరఫరా లేక పొలాలకు నీటి త డులు అందడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్ర భుత్వం వస్తే విద్యుత్‌ రాదనే విషయాన్ని రేవంత్‌రెడ్డి నిరూపించాడని ఎద్దేవా చేశా రు. నెట్టంపాడు ఎత్తిపోతల పథకం లో రిజర్వాయర్లకు పంపుల ద్వారా 24గంటలపాటు ఎత్తిపోయాల్సి ఉండగా, ప్రభుత్వ మొద్దు నిద్ర వల్లే నీళ్లు లేవని అన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 11:23 PM