ఫాంపాండ్తో.. పంటలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:36 PM
ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో బోర్లలో సైతం నీరు తగ్గిపోతుండగా, కొందరు రైతులు ఉన్న నీటిని ఒడిసి పట్టి పంటలు సాగు చేస్తున్నారు.
- నాలుగు నీటి గుంతలతో పదెకరాల్లో వరి, అర ఎకరంలో కూరగాయల సాగు
హన్వాడ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో బోర్లలో సైతం నీరు తగ్గిపోతుండగా, కొందరు రైతులు ఉన్న నీటిని ఒడిసి పట్టి పంటలు సాగు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నాయినోనిపల్లికి చెందిన నలుగురు రైతులు సుజాత, చంద్రయ్య, చెన్నయ్య, తిరుపతయ్య పదెకరాల్లో వరి, అర ఎకరంలో కూరగాయలు సాగు చేశారు. ఆరేళ్ల క్రితం ఉపాధి హామీ పథకం ద్వారా ఫాంపాండ్ (నీటి నిల్వ గుంతలు) 6 మీటర్ల పొడవు. 10 ఫీట్ల వెడల్పుతో పాటు 10 ఫీట్ల తోతుగా రైతు పొలంలో తవ్వారు. దీనికి తోడు మరో రెండు ఫాంపాండ్ సొంత ఖర్చుతో తవ్వుకున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ సారి వర్షాలు తక్కువ కురియడంతో ఉన్న బోర్లల్లో వస్తున్న నీటిని ఫాంపాండ్లో నింపి నిత్యం పంటలకు నీరు అందించి కాపాడుకుంటున్నారు. గతంలో వర్షాకాలంలో బోరు బావులతోనే పంటలు పండించే వారు. ఎల్నినో ప్రభావంతో నీరు లేక విద్యుత్ కోతలతో పంటలు పండని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ఫాంపాండ్తో సాగు చేసిన పంటలకు సరైన సమయంలో నీటిని అందించి కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం పంట కంకి బయట పడి గింజ గట్టిపడే దశకు చేరింది. మరో 15 రోజులు పంటకు నీరు అందిస్తే చేతికి వస్తోంది.