వారబందీతోనే పంటల రక్షణ
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:52 PM
ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వానాకాలం పంటలను కాపాడుకు నేందుకు వారబందీ విధానంలో నీటిని సక్రమంగా విని యోగించుకోవడమే మార్గమని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
-జూరాలకు కృష్ణా జలాలు విడుదల
- నవంబరు 27వరకు నీటి పంపిణీకి ప్రణాళిక
-ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత
-జాగ్రత్తగా వినియోగించుకోవాలి
-రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వానాకాలం పంటలను కాపాడుకు నేందుకు వారబందీ విధానంలో నీటిని సక్రమంగా విని యోగించుకోవడమే మార్గమని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కృష్ణానది జలాలపై గురు వారం వనపర్తి కలెక్టరేట్‌లో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్‌సురభి, నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనం తరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి పాలమూరు రైతులు వానాకాలంలో వేసిన పంటలను ఎలాగైనా కాపాడుకోవాలనే సంకల్పంతో కర్ణాటక ముఖ్య మంత్రితో మాట్లాడి జూరాలకు నీటిని విడుదల చేయించా మన్నారు. కృష్ణానది జలాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా లో వానాకాలం పంట పండించుకోవడానికి, తాగునీటికి 18.19 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని తెలిపారు. కానీ, ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రాజెక్టుల్లో సరిపడా జలాల లేవని, ప్రస్తుతం జూరాలలో ఉన్న 7టీఎంసీలు, ప్రస్తుతం కర్ణాటక నుంచి విడుదల చేస్తున్న జలాలు, ఇతర వరదల తో కలుపుకున్నా ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకుంటే వానా కాలం పంటతోపాటు తాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చని అధికారులకు సూచించారు. రైతులకు సాగునీరు వార బందీ పద్దతిలో డిస్ట్రిబ్యూటరీ వారీగా సమానంగా నీళ్లు వదలాలని అఽధికారులను ఆదేశించారు. దీని కోసం లష్కర్ల ను, ఇతర సిబ్బందిని ఉపయోగించుకుని ఒక క్రమ పద్దతిలో నీళ్లు వదలాలని సూచించారు. వ్యవసాయ అధి కారులకు వారబందీపై అవగాహన కల్పించి రైతులకు అవ గాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. డిస్ర్టిబ్యూటరీ కెనాల్‌లో జమ్ము, ిసిల్ట్ తొలగించడా నికి ఇతర నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాల ని సూచించారు. వానాకాలంలో రైతులు వేసిన పంటలను కాపాడుకోవడానికి ముందుగానే కర్ణాటక ముఖ్యమంత్రికి నీటి విడుదలపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపా రు. కానీ అసెంబ్లీ కారణంగా రెండు రోజులు ఆలస్యమైంద ని, అంతలోపే ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయని అన్నారు. కర్ణాటకలోనూ ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడడం తో జూరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కు జిల్లా రైతాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజే శారు. నవంబరు 27వరకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తేనే పంటలను కాపాడుకోవచ్చు. కాబట్టి రైతులు సహకరించి వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి సహకరించాలని కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, సాగునీటి రంగానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులు వేసిన పంటలు ఒక ఎకరం కూడా ఎండిపోకూడదన్న లక్ష్యంతో కృష్ణానీటిని జూరాలకు విడుద ల చేయించినట్లు తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధు సూదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు జూరాల వద్ద రా ద్దాంతం చేయకముందే కర్ణాటక ముఖ్యమంత్రికి నీటి విడు దలపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. రెండు మోటార్లు ఆన్ చేయించి సాధ్యమైనంతగా కోయిల్‌సాగర్ నింపుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారు లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఎస్పీ సునీతా రెడ్డి, గద్వాల ఎస్పీ శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ రహీముద్దీన్, ఎస్‌ఈ చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.