Share News

యోగా సంస్కృతి పెరిగితే నేరాలు తగ్గుముఖం

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:11 PM

సమాజంలో యోగాసంస్కృతి పెరిగితే నేరాల శాతం తగ్గుముఖం పడుతుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.

యోగా సంస్కృతి పెరిగితే నేరాలు తగ్గుముఖం
గద్వాలలో యోగాసనాలు వేస్తున్న ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీ, పోలీసు అధికారులు

  • జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): సమాజంలో యోగాసంస్కృతి పెరిగితే నేరాల శాతం తగ్గుముఖం పడుతుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగా సాధనలో పాల్గొని వివిధ యోగాసనాలు వేశారు. ఈసందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమన్నారు. ప్రతీ వ్యక్తి రోజువారి జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలన్నారు. నిత్య యోగా సాధన ద్వారా శారీరక దృఽఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని, ఒత్తిడి తగ్గి ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందన్నారు. తద్వారా మృధుస్వభావులుగా మారుతారని, ఈ కారణంగానే నేరాల శాతం కూడా తగ్గుతుందని సూచించారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో ప్రాణాయామం, ప్రణామాసనం, హస్త, ఉత్తానాసనం, అశ్వసంచలనాసనం, దండాసనం, అష్టాంగ నమస్కారాసనం వేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్‌, డీఎస్పీ మొగులయ్య, ఏఆర్‌ డీఎస్సీ నరేందర్‌రావు, పోలీస్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 11:11 PM