Share News

నేటి నుంచి క్రికెట్‌ పోరు

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:48 PM

పాలమూరు నగరంలో నేటి నుంచి క్రికెట్‌ సంబురం ప్రారంభం కానున్నది.

నేటి నుంచి క్రికెట్‌ పోరు
క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్న అల్లీపూర్‌ మైదానం, పిచ్‌ను సిద్ధం చేస్తున్న కార్మికులు

- రాష్ట్రస్థాయి బాలుర అండర్‌-19 టోర్నీకి వేదికగా పాలమూరు

- 10 జిల్లాల నుంచి తరలిరానున్న 160 మంది క్రీడాకారులు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు నగరంలో నేటి నుంచి క్రికెట్‌ సంబురం ప్రారంభం కానున్నది. జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నుంచి 3వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అండర్‌ -19 బాలుర క్రికెట్‌ టోర్నీ నిర్వహించనున్నారు. పోటీ ల్లో పాల్గొనేందుకు 10 జిల్లాల నుంచి తర లిరానున్న క్రీడాకారులకు అవసరమైన వసతి, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.

సాయంత్రం 5 గంటలకు ప్రారంభం

పాలమూరు నగరంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరే షన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ ఎస్‌జీఎఫ్‌ ఐ అండర్‌-19 రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌కు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు, 30 మంది అఫిషియల్స్‌, కోచ్‌లు, మేనేజర్లు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బాలుర కళాశాల మైదానంలో పోటీలు ప్రారంభం కానున్నాయి. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేమర్‌ జి.మమత, డీఐఈవో సి.రమణి హాజరుకా నున్నారు. పోటీలను లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. బండమీదిపల్లి స్టేడియం, బాలుర కళాశాల మైదానం, ఎండీసీఏ మైదానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భవనంలో క్రీడాకారులు బస వసతి, భోజన వసతి ఏర్పాటు చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జట్టు

జశ్వంత్‌, అభినవ్‌, బీరేందర్‌, సయ్యద్‌ ఫైజన్‌, గగన్‌, రామ్‌కుమార్‌ చర్రి, సీహెచ్‌ అభినవ్‌, మణిచరణ్‌, శివ (మహబూబ్‌నగర్‌) సిద్దర్థ, రా జేశ్‌ (గద్వాల), అఫ్సన్‌ (నారాయణపేట), అకిల్‌ టెండుల్కార్‌ (వనపర్తి), జోసెఫ్‌, ముస్తాఫా, కేతేశ్వర్‌ (నాగర్‌కర్నూల్‌).

ఏర్పాట్లు పూర్తి చేశాం

రాష్ట్రస్థాయి అండర్‌-19 ఎస్‌జీఎఫ్‌ బాలుర క్రికెట్‌ టోర్నీకి బాలుర కళాశాల మైదానం, బండమీదిపల్లి, ఎండీసీఏ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. 10 జిల్లాల నుంచి రానున్న 160 మంది క్రీడాకారులకు అవసరమైన బస, భోజన వసతి కల్పిస్తున్నాం. అందరి సహకారంతో టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తాం.

- వేణుగోపాల్‌, అండర్‌-17,19 ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ, మహబూబ్‌నగర్‌

Updated Date - Oct 30 , 2026 | 11:48 PM